కర్నూలు,ఆగస్టు 02, (way2newstv.com):
ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరువ వేసేందుకు గ్రామ వాలంటీర్లను ఎంపిక చేస్తామని, ప్రభుత్వ పథకాల్లో వాలంటీర్లకు సంపూర్ణ శిక్షణనిన్ని అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టరు జి.వీరపాండియన్ టి.ఓ.టిలను (ట్రైనర్ ఆఫ్ ట్రైనింగ్) ఆదేశించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ భవనంలో గ్రామ పంచాయితీ వాలంటీర్ల జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సిఇఓ విశ్వేశ్వర నాయుడు, డిపిఓ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ఆత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామ వాలంటీర్ల పాలనా వ్యవస్థను తీసుకొచ్చిందని ఈ నేపధత్యంలో ఎంపిక చేసిన గ్రామ వాలంటీర్లకు ప్రభుత్వ పథకాల పై సంపూర్ణ అవగాహన కల్పించాలని ఆదేశించారు.
గ్రామ వలంటీర్లకు శిక్షణ
వాలంటీర్ల శిక్షణ కోసం 9 మందికి బాపట్లలో గత నెల 29,30 తేదిలో ప్రత్యేక శిక్షణ ఇప్పించామన్నారు. జిల్లా స్థాయిలో మండలానికి 6 మంది చొప్పున 53 మండలాలకు 318 మందికి టి.ఓ.టిలకు శిక్షణ విచ్చి తద్వారా ఈ నెల 5 నుండి 10వ తేది వరకు అన్ని మండలాల్లో ఎంపిక చేసిన వాలంటీర్లకు ప్రబుత్వ సంక్షేమ పథకాల పై పరిపూర్ణ అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. నూతనంగా ఎంపికైనా వాలంటీర్లకు ప్రభుత్వ విధివిధానాలు, అనుసరించాల్సిన పద్దతుపై అవగాహన వుందని ప్రభుత్వ అధికారులతో సమానంగా వాలంటీర్ల వ్యవస్థ పనిచేస్తోందని అన్ని సంక్షేమ పథకాల తీరుతెన్నులపై క్ష్లుణ్ణంగా వివరించాలన్నారు. అర్హలైన అబ్ధిదారులకు సంక్షేమ పథకాలు చేరవేసేందుకు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఉపయోగపడుతుందని అక్టోబర్ 2 నుండి గ్రామ సచివాలయ వ్యవస్థ అమలులోకి రానుందని గ్రామ వాలంటీర్లు సచివాలయ సెక్రటరీతో అనుసంధానంగా పనిచేయల్పి ఉంటుందన్నారు. ఒక గ్రామ పంచాయితీ సెక్రటరీ చేయాల్సిన విధులు ప్రజల సంక్షేమ కోసం 6 లేదా 7 మంది గ్రామ వాలంటీర్లు పనిచేస్తారన్నారు. గ్రామ సచివాలయం ఏర్పటైతే కేవలం 72 గం అర్హలైన లబ్దిదారునికి రేషన్, పెన్షన్, ఇతర సంక్షేమ పధకాల లబ్ధి చేకూర్పాల్సి ఉంటుందదన్నారు. గ్రామ వాలంటీర్ల పనితీరు మీరు ఇచ్చే శిక్షణ పైనే ఆధారపడి వుంటుందని శిక్షణ ఏలాంటి లోటుపాట్లు ఉండకూడదని అనుమానాలు వుంటే నివృతి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. గ్రామ వాలంటర్ల సరిగా పనిచేయకపోయినా, అవినీతికి పాల్పడినా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం స్పష్టంగా, బలంగా చెప్పాలన్నారు. జిల్లా పరిషత్ అవరణలో మూడు బ్యాచ్ లుగా టి.ఓ.టిలకు రెండు రోజుల పాటు ఇచ్చే శిక్షణ లో ఏలాంటి సందేహలున్నా మాస్టర్ ట్రైనిలతో తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై మండలాల్లో సంబంధిత అధికారులు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్ని తమ సంబంధిత పథకాల పై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడి ఠాగుర్ నాయక్, డియంహెచ్ ఓ డా.ప్రసాద్ , ఎస్.సి.టి.బి.సి మైనార్టీ కార్పొరేషన్ల ఇడిలు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Andrapradeshnews