జనాల్లోకి తమ్మినేని సీతారామ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జనాల్లోకి తమ్మినేని సీతారామ్

శ్రీకాకుళం, ఆగస్టు 14 (way2newstv.com)
స్పీకర్ తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఎన్నికయ్యారు. నిజానికి ఆయనకు స్పీకర్ గా ఎంపిక కావడం ఇష్టంలేదు. మంత్రినవ్వాలని గట్టి కోరిక. అయినా వైఎస్ జగన్ వత్తిడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్ బాధ్యతలను తమ్మినేని సీతారాం చేపట్టారు. శ్రీకాకుళం ిజిల్లా ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఎన్నికైన తమ్మినేని సీతారాం తన మేనల్లుడు టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ పై విజయం సాధించారు.తమ్మినేని సీతారాంకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకమైంది. వరసగా ఓటములు చవిచూస్తున్న తమ్మినేని సీతరాం ఈ ఎన్నికల్లో గెలవడంతో పాటు మంత్రి పదవి కూడా వస్తుందనకున్నారు. కానీ జగన్ చివరి నిమిషంలో స్పీకర్ నే చేసేశారు. అయితే ఇక్కడ స్పీకర్ గా చేసిన వారు మరోసారి గెలవరన్న సెంటిమెంట్ బలంగా ఉంది. 
జనాల్లోకి  తమ్మినేని సీతారామ్  
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్పీకర్ గా పనిచేసిన వారు ఎన్నికల్లో ఓటమి పాలు కావడం చూస్తూనే ఉన్నాం. ఈ సెంటిమెంట్ తమ్మినేని సీతారాంను భయపెడుతున్నట్లుంది.మరోసారి గెలవలేనన్న భయంతో తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఉన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. స్పీకర్ గా ఉండి సమీక్షలు చేయడమేంటని ఆయన మేనల్లుడు, టీడీపీనేత కూన రవికుమార్ విమర్శలను తిప్పికొట్టారు. కారుకూతలు కూసే వాళ్లను పట్టించుకోనని చెప్పారు. అంతేకాదు తాను తొలుత ఎమ్మెల్యేనని, ఆ తర్వాతే స్పీకర్ నని గుర్తుంచుకోవాలన్నారు. ఆముదాల వలస ప్రజల కష్టాలు తీర్చడం స్పీకర్ పనికాదా? అని ప్రశ్నించారు.సాధారణంగా స్పీకర్ గా ఉండే వారు వివాదాలకు దూరంగా ఉంటారు. అంతేకాదు ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉంటారు. అయితే తమ్మినేని ఆ దారిలో వెళితే తనకూ సెంటిమెంట్ చుట్టుకుంటుందని భయపడ్డారేమో. తాను జనంలోనే ఉంటానని చెబుతూ గ్రామ వాలంటీర్ల అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కోన్ కిస్కా గొట్టంగాళ్లు ఎవరు అడ్డుతగిలినా భయపడవద్దని, తాను మీకు అండగా ఉంటానని అభయమిచ్చారు. మొత్తం మీద తమ్మినేని సీతారాంలో మాత్రం మిగిలిన స్పీకర్లలా కాకుండా కొంత భిన్నమైన మార్గంలో వెళ్లి మరోసారి ఎన్నిక కావాలన్న తాపత్రయే ఎక్కుగా కన్పిస్తుంది.