కాకినాడ, ఆగస్టు 1, (way2newstv.com)
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్ గోదావరి వరద ఉధృతికి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని 34 గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి.దండంగి కాలువకు వరదనీరు పోటెత్తడంతో మండలకేంద్రానికి ఇతర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.భద్రాచలం వద్ద గత రాత్రి నీటిమట్టం 38అడుగుల వరకు చేరుకుంది .భద్రాచలం ఎగువ ప్రాంతం వాజేడు వద్ద వరద తగ్గుముఖం పడుతున్నది.దేవీపట్నం మండలానికి వరద ప్రభావం మరో 24గంటలు వరకు ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
జలదిగ్బంధంలో గ్రామాలు
ఇతరప్రాంతాలకు వెళ్ళిన దేవీపట్నం మండల ప్రజలు వరద పరిస్థితి తెలుసుకొని తమ గ్రామాలకు తిరిగి ప్రయాణమవుతున్నారు.అయితే కాలువలకు వరదనీరు పోటెత్తడంతో రాకపోకలకు అధికారులు పడవలు ఏర్పాటు చేశారు. గతంలో భద్రాచలం వద్ద గోదావరి 50అడుగులకు చేరుకున్నపుడు దేవీపట్నం మండలానికి ఇప్పుడున్న పరిస్థితి ఉండేది.అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లో భాగంగా గోదావరికి అడ్డంగా సుమారు 2600మీటర్ల మేర వెడల్పు,35మీటర్ల ఎత్తులో నిర్మించడం కారణంగానే దేవీపట్నం మండలంలోని గ్రామాలు వరద మంపుకు గురయ్యాయని మండల ప్రజలు విమర్శిస్తున్నారు.అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగాగోదావరికి అడ్డుగా సుమారు 2600మీటర్ల వెడల్పు ,35మీటర్ల వెడల్పుతో" కాఫర్ డ్యాం "నిర్మాణం కారణంగా నే దేవీపట్నం మండలానికి ముంపు ప్రమాదం ఏర్పడింది.
Tags:
Andrapradeshnews