రోగాల రాష్ట్రంగా మారిన తెలంగాణ: భట్టి విక్రమార్క

హైదరాబాద్ ఆగష్టు 14 (way2newstv.com)
తెలంగాణ రోగాల రాష్ట్రంగా మారిందని సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హెల్త్‌ ఎమర్జెన్సీప్రకటించి కేంద్రం చొరవ తీసుకోవాలన్నారు. ఈనెల  రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో పర్యటిస్తానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. 
రోగాల రాష్ట్రంగా మారిన తెలంగాణ: భట్టి విక్రమార్క   

కేసీఆర్‌ రాజమహల్‌ నుంచి బయటకొచ్చిచూస్తే సమస్యలు తెలుస్తాయన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం మాఫియా చేతుల్లో నడుస్తోందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్‌ భావజాలాన్ని నమ్మినవారు పార్టీలోనే ఉంటారని, పార్టీని వీడినవారు కొందరు కొప్పులరాజును బద్నాం చేయడం తగదని భట్టి విక్రమార్క అన్నారు.
Previous Post Next Post