నిర్మల్, ఆగస్టు,12 (way2newstv.com)
సోమవారం నిర్మల్ జిల్లాలోని ప్రతి మండలలో ఈద్గా మసీదుల వద్ద బక్రీద్ పర్వదినాన ప్రార్థనలుముస్లీంలు చేసారు. ప్రార్థనల కోసం వచ్చే వారితో మసీదులు కిటకిటలాడాయి. ప్రార్థనలు ప్రశాంతంగా ముగిసినాయి. జిల్లా పోలీసు ఉన్నతాధికారి .సి.శశిధర్ రాజు ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
త్యాగానికి ప్రతిక బక్రీద్
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ త్యాగ నిరతికి ప్రతిరూపంగా నిలిచే బక్రీద్ పండుగను శాంతియుత వాతవరణంలో జరుపుకోవాలని అన్నారు. ప్రార్థన సమయంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను తెలిపారు. ఈద్గాలు, మసీదుల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ డిఎస్పి ఉపేందర్ రెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ వెంకటేష్, పట్టణ, గ్రామీణ సి.ఐ.లు జాన్ దివాకర్,శ్రీనివాస్ రెడ్డి, సోన్ సి.ఐ. రమేష్ బాబు, ఆర్.ఐ. వెంకటి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Tags:
telangananews