ప్రస్తుతం పాఠశాలలకు సరఫరా అయిన అల్బెండజోల్ మాత్రలు వాడరాదు. జిల్లా సంయుక్త పాలానాధికారి బి. రాజేషం

జగిత్యాల  ఆగస్టు 8 (way2newstv.com - Swamy Naidu)
ప్రస్తుతం పాఠశాలలకు సరఫరా అయిన నులిపురుగుల నివారణ నిమిత్తం అల్బెండజోల్ మాత్రలు వాడరాదని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు జిల్లా సంయుక్త పాలానాధికారి బి.రాజేషం తెలిపారు.   జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రదానోపాద్యాయులతో గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జల్లా సంయుక్త పాలానాధికారి బి. రాజేషం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బముగా ఆయన మాట్లాడుతు ఏడాది నుండి 19 ఎళ్ల వయస్సు గల వారికి నులిపురుగుల నివారణ నిమిత్తం అల్బెండజోల్  మాత్రలు వాడరాదని తెలిపారు.  ప్రస్తుతం పాఠశాలలకు సరఫరా చేసిన మాత్రలు విద్యార్థులకు ఇవ్వకూడదని మండల విద్యాధికారులను, అన్ని పాఠశాలల ఉపాద్యాయులను ఆదేశించారు. 
 ప్రస్తుతం పాఠశాలలకు సరఫరా అయిన అల్బెండజోల్ మాత్రలు వాడరాదు.
 జిల్లా సంయుక్త పాలానాధికారి బి. రాజేషం
వర్షాలు పడుతున్నందున పాఠశాల భవనాలపై చెత్తను,  మొక్కలును తొలగించాలని,  చెత్త వలన వర్షపు నీరు పైకప్పు ద్వారా ఇంకి గదిలోకి రావడంతో  పాటు పెచ్చులు ఉడే ప్రమాదం ఉంటుందని, కావున పాఠశాల భవనాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. పాఠశాల భనాలపై మట్టి, చెత్త, పిచ్చి మొక్కలను తొలగించకుండా ఉన్నట్లయితే సంబంధిత ప్రదానోపాద్యాయులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాఠశాల భవనాలకు మరమ్మతులు ఉన్న, భవనము దెబ్బతిన్నట్లు గమనించిన ఉన్నతాధికారులు సమాచారం అందించాలని తెలిపారు.  చిన్నచిన్న మరమ్మత్తులను  ఇఇపిఆర్, ఎఈ లు చేస్తారని,  అందుకు సంబందించిన వివరాలను పంపాలని అలసత్వం వహించరాదని అన్నారు. పాఠశాల ఆవరణలో, పాఠశాల భవనం పైన మొక్కలు, చెత్తాచెదారము, మట్టి లాంటివి లేవని సంబంధిత పాఠశాల ప్రదానోపాద్యాయులు వ్రాతపూర్వకంగా తెలియజేయాలని తెలపారు. ఉపాద్యాయులు అందరు పాఠశాల ఆవరణలో గ్రాఫ్టెడ్ మొక్కలను నాటాలని,  పెద్ద పండ్ల మొక్కలు స్వంతడబ్బులతొ తెప్పించిన నాటాలని, ఆ మొక్కలకు మీ పేరు లేదా మీ కుంటుంబ సభ్యుల పేరు పెట్టుకోవచ్చునన్నారు.  మీరు కూడా మరెవరైన స్వచ్చందంగా ఇచ్చినను వాటిని నాటి పెంచే బాద్యత తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి  వెంకటేశ్వర్లు,  ఎడి శివకృష్ణ, మండల విద్యాధికారులు, ప్రదానోపాద్యాయులు వివిధ  మండలాల నుండి పాల్గోన్నారు. 
Previous Post Next Post