పకడ్బందీగా వాలంటీర్ల పరీక్షల ఏర్పాట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పకడ్బందీగా వాలంటీర్ల పరీక్షల ఏర్పాట్లు

చిత్తూరు, ఆగష్టు 22 (way2newstv.com)  
సెప్టెంబర్ 1 నుండి ప్రారంభం కాబోయే గ్రామ/ వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల ఏర్పాట్లను పకడ్భందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా పేర్కొన్నారు. గురువారం స్థానిక నాగయ్య కళాక్షేత్రం లో సెప్టెంబర్ 1 వ తేదీ నుండి ప్రారంభం కాబోయే గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్షల ఏర్పాట్లలో భాగంగా జిల్లా స్థాయి అధికారులు, తహశీల్దార్లు, ఏంపిడిఓ లు, ఎంఇఓ లు, మున్సిపల్ కమిషనర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు ఒకరికొకరు సమన్వయంతో పని చేసి గ్రామ/ వార్డు సచివాలయాల ఉద్యోగాల ఎంపికకు సంబంధించిన పరీక్షలను విజయవంతం గా నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. 
పకడ్బందీగా వాలంటీర్ల పరీక్షల ఏర్పాట్లు

సెప్టెంబర్ 1 వ తేదిన ఉదయం 380 కేంద్రాలలో 1,07,715 మంది అభ్యర్థులు, అలాగే మధ్యాహ్నం 103 కేంద్రాలలో 28,194 మంది అభ్యర్థులు, 41 మండల హెడ్ క్వార్టర్ మరియు మున్సిపాలిటీలలో పరీక్షలు వ్రాస్తున్నారని తెలిపారు. ఈ పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి జె సి 2 నేడు విపులంగా అధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు. ఈ పరీక్షలకు సంబంధించి రూల్స్ మరియు రెస్పాన్స్ బిలిటీస్ గురించి అధికారులు పూర్తి స్థాయిలో తెలుసుకుని ఉండాలన్నారు. పరీక్షా కేంద్రాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు అనే విషయాన్ని అధికారులకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలన్నారు. పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, స్యానిటేషన్, విద్యుత్, ఫర్నీచర్, సెక్యూరిటి ఖచ్చితంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షలలో ఎక్కడా కానీ సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు వారికి కేటాయించిన స్థానం లోనే కూర్చునే విధంగా చూసుకోవాలన్నారు. పరీక్షలు వ్రాసే అభ్యర్థులు పరీక్షల అనంతరం ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ ను ఇన్విజిలేటర్ కు అందజేసి డూప్లికేట్ ఓఎంఆర్ షీట్ ను అభ్యర్థి తీసుకెళ్లే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షలు వ్రాసే అభ్యర్థులకు స్పష్టమైన సూచనలను తెలియజేయాలన్నారు. ఈ పరీక్షలకు సంబంధించి అధికారులు ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. పరీక్షలు వ్రాసే అభ్యర్థులకు ఏదైనా వైద్య పరంగా సహాయం అవసరం అయితే సమీపంలోని ఆసుపత్రులు అప్రమత్తంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో అన్ని హోటళ్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టి హోటళ్ళళ్ళో ఆహారం సరైన ధరలలో అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. పరీక్షలకు సంబంధించి నేడు నిర్వహించిన శిక్షణకు హాజరైన అధికారులకు ఒక హ్యాండ్ బుక్ ను అందజేయడం జరిగిందని, ఈ హ్యాండ్ బుక్ ను అధికారులు క్షుణ్ణంగా చదువుకుని అవగాహన పెంచుకోవాలన్నారు. పరీక్షల సమయంలో 144 సెక్షన్ అమలు, జిరాక్స్ కేంద్రాల మూసివేత, బందోబస్తు లాంటి చర్యలను తహశీల్దార్లు చేపట్టాలన్నారు. సెప్టెంబర్ 3, 4, 6,తేదీలలో తిరుపతిలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే 7వ తేదీ చంద్రగిరి, రేణిగుంట, తిరుపతిలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే 8వ తేది తిరుపతిలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల్లో లైటింగ్ సౌకర్యం ఖచ్చితంగా ఉండాలన్నారు. మండల స్థాయిలో ఆటో వారిని పిలిపించి పరీక్ష కేంద్రాల జాబితా వారికి అందజేసి అవగాహన కల్పించాలన్నారు. పరీక్షా కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు నిర్ణీత సమయంకన్నా కొంత ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, హెడ్ ఫోన్లు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబడవన్నారు. అనంతరం జెసి 2 చంద్రమౌళి మాట్లాడుతూ రాష్ట్రంలో అక్టోబర్ 2 నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రామ/ వార్డు సచివాలయాలు ప్రారంభం కానున్నాయని, వీటికోసమే చిత్తూరు జిల్లాలో 9,717 ఉద్యోగాలకు జిల్లా కలెక్టర్ నోటిఫై చేశారని, ఇందుకు సంబంధించి వ్రాత పరీక్షలు సెప్టెంబర్ 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో జరుగుతాయన్నారు. 12 రకాల పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సెలక్షన్ కమిటీ ఏర్పాటైందన్నారు. ఈ పరీక్షలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 21 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు వ్రాస్తున్నారని, మన చిత్తూరు జిల్లాలో 1.88 లక్షల మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పరీక్షలకు సంబంధించి అధికారులకు ఏదైతే విధులు కేటాయించామో ఆ విధులను అధికారులు తూచా తప్పకుండా నిర్వహించాలన్నారు. ఈ పరీక్షలకే అధికారులు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 6,500 మంది సీనియర్ టీచర్లను ఇన్విజిలేటర్లుగా నియమించామన్నారు. ఈ పరీక్షలకు సంబంధించి చిత్తూరులో ఒక స్ట్రాంగ్ రూమ్, తిరుపతిలో ఒక స్ట్రాంగ్ రూమ్ ను గుర్తించామని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం లో ఇద్దరు వీడియో గ్రాఫర్లు కవరేజ్ చేస్తారని, వీరికి గుర్తింపు కార్డు కూడా ఇవ్వడం జరుగుతుందని, కవరేజ్ అనంతరం సిడిని స్పెషల్ ఆఫీసర్ లకు అందజేయాలన్నారు. అనంతరం జెడ్పి సిఇఓ కోదండరామి రెడ్డి మాట్లాడుతూ ఈ పరీక్షలకు సబంధించి జిల్లా వ్యాప్తంగా 41 మండలాల లోని 380 కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పరీక్షలకు సంబంధించి 1902 టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేస్తున్నామని, విద్యార్థులకు, అధికారులకు పరీక్షలకు సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు సంప్రదిస్తే సందేహాల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అధికారులు ఒకరికొకరు సమన్వయం తో పని చేసి పరీక్షలను విజయవంతం చేసి జిల్లా కు, జిల్లా కలెక్టర్ కు మంచి పేరు తీసుకురావాలని కోరారు.  ఈ కార్యక్రమం లో మదనపల్లె సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి, శిక్షణా కలెక్టర్ పృథ్వీ తేజ్, చిత్తూరు, తిరుపతి ఆర్డిఓ లు రేణుక, కనకనరసా రెడ్డి, అబ్జర్వర్ జ్యోతి, జిల్లా స్థాయి అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడిఓ లు, ఎంఇఓ లు, మున్సిపల్ కమిషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.