కల్వకుంట్ల కుటుంబ సేవలో టిఆర్ఎస్ నాయకులు: బీజేపీ కె.లక్ష్మణ్‌

మహబూబ్‌నగర్‌ ఆగష్టు 29  (way2newstv.com):             
కల్వకుంట్ల కుటుంబ సేవలోనే నాయకులు గడుపుతున్నారనిబీజేపీఅధ్యక్షుడు కె.లక్ష్మణ్‌విమర్శించారు.దేశానికి నరేంద్రమోదీ నాయకత్వం అవసరం ఉంది కాబట్టే ఇతర పార్టీ నాయకులు బీజేపీలో చేరుతున్నారని అన్నారు. గురువారం పాలేరు బీజేపీ సభలో మాట్లాడుతూ ఫామ్‌హౌజ్‌కే పరిమితమైన కేసీఆర్‌ బంగారు తెలంగాణను ఎలా నిర్మిస్తారని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. 
 కల్వకుంట్ల కుటుంబ సేవలో టిఆర్ఎస్ నాయకులు: బీజేపీ కె.లక్ష్మణ్‌

అధికారంలో ఉన్నామని విర్రవీగడం సరికాదని.. దేశంలోని 18 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉందన్న విషయాన్ని కేసీఆర్‌ గుర్తు చేసుకోవాలన్నారు. ఎందరో అమరుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ తప్పక అధికారంలోకి వస్తుందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా కమల వికాసమే అంటూ ధీమా వ్వక్తం చేశారు. ఇప్పుడు జరిగేందంతా సినిమా విడుదలకు ముందు ట్రైలర్‌ మాత్రమేనని అసలు సినిమా ముందుందని వ్యాఖ్యానించారు.
Previous Post Next Post