ఏపీలో కరెంట్ సంక్షోభం.... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీలో కరెంట్ సంక్షోభం....

గుంటూరు, ఆగస్టు 1, (way2newstv.com)
ప్రస్తుతం  రాష్ట్రంలో కరెంట్ పరిస్థితి ఏంటి ? కరెంట్ సంక్షోభం వస్తుందా ? లేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంధి మార్గంలో వెళ్లి, గట్టెక్కిస్తుందా ? ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం విధించిన  డెడ్ లైన్ ను, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవటంతో, టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి కారణం, విద్యుత్ సంస్థలకు, డిస్కింలకు, ముందస్తు చెల్లింపుల హామీ ఇవ్వాలని. అదే లెటర్ అఫ్ క్రెడిట్ నిబంధన. రాష్ట్ర ప్రభుత్వం లెటర్ అఫ్ క్రెడిట్ ఇస్తేనే, విద్యుత్ సరఫరా చేస్తామని కేంద్రం చెప్పింది. ఈ నిబంధన పాటించకపొతే, కేంద్ర సంస్థల నుంచి వచ్చే కరెంట్ బంద్ అవ్వక తప్పదు. రాష్ట్ర ప్రభుత్వంతో సొంతగా విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలకు, ఇది వర్తించదు అని కేంద్రం చెప్పింది.
ఏపీలో కరెంట్ సంక్షోభం....

డిస్కింలకు ప్రభుత్వాలు చెల్లించాల్సిన బకాయలు పెరిగిపోతూ ఉండటం, అవి తీర్చే సత్తా రాష్ట్రాలకు లేకపోవటంతో, డిస్కింలకు ఆర్ధిక చేయూత అందించటానికి, వాటిని బలపరచటానికి, కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు మన రాష్ట్ర ప్రభుత్వం దీని పై ఏ స్పందన ఇవ్వలేదు. ఇది మొయ్యటం మా వల్ల కాదని, కేంద్రానికి మౌఖికంగా చెప్పినట్టు తెలుస్తుంది. ఒక వేళ కేంద్రం అడిగినట్టు చేస్తే ఎలా ఉంటుంది అంటూ, రాష్ట్ర ప్రభుత్వం, ఆర్ధిక శాఖను కోరింది. అంత భారం మనం మోయగలమా, లేక ఇంకా ఎమన్నా వేరే ప్రతిపాదనలు ఇద్దామా అనే విషయం పై కసరత్తు చేస్తున్నారు. రేపటితో, చివరి తేదీ కావటంతో, ఈ రోజు దీని పై ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితులు వచ్చాయి.ఇలా గ్యారంటీ కనుక ఇస్తే, ఏ రోజుకి ఆ రోజు చెల్లింపులు చెయ్యాలి. ఈ భారం మొయ్యటం మా వల్ల కాదు అని కేంద్రానికి చెప్పినా, సరైన స్పందన కేంద్రం నుంచి రాలేదు. ఆటంకం లేకుండా మీ రాష్ట్రాలకు విద్యుత్తు సరఫరా కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం లెటర్ అఫ్ క్రెడిట్ ఇవ్వాల్సిందే అంటూ కేంద్రం చెప్తుంది. ఎల్‌సీలు ఇవ్వటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పై ఎంత భారం పడుతుంది అనే అంశాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే దీని పై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఒక వేళ కేంద్రాన్ని ధిక్కరిస్తే, మన పరిస్థితి ఏంటి అనేది ఆలోచిస్తేనే భయం వేస్తుంది. రాష్ట్రం కనుక మేము చెల్లింపులు చెయ్యలేము అంటే, కేంద్రం అదే వైఖరితో ఉంటుందా ? ఒక వేళ అదే వైఖరితో ఉంటే, మనకు కరెంటు కష్టాలు తప్పవా ? చూద్దాం ఏమి అవుతుందో ?