తెలంగాణలో కొత్తగా ఆరు ఎయిర్ పోర్టులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణలో కొత్తగా ఆరు ఎయిర్ పోర్టులు

హైద్రాబాద్, ఆగస్టు 14  (way2newstv.com)
విమానయాన రంగంలో ఇతర రాష్ట్రాలు దూసుకుపోతుంటే తెలంగాణలో ఆ రంగం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, కడప, కర్నూలు నగరాల్లో విమానాశ్రయాలు ఉంటే... తెలంగాణలో మాత్రం కేవలం హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌లోనే ఎయిర్‌పోర్ట్ ఉంది. దీంతో తెలంగాణ ప్రజలు వియాన ప్రయాణం చేయాలంటే హైదరాబాద్‌కు రావాల్సిందే. ఆ లోటు తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం నడుం కట్టింది. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ఆదిలాబాద్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, కొత్తగూడెంలలో విమానాశ్రయాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

తెలంగాణలో కొత్తగా ఆరు ఎయిర్ పోర్టులు
ఉడాన్‌ కింద వీటిని నిర్మించాలని యోచిస్తోంది. వరంగల్‌, పెద్దపల్లి, ఆదిలాబాద్‌‌లో ఇప్పటికే ఎయిర్‌ స్ట్రిప్‌లు ఉన్నాయి. వరంగల్‌ ఎయిర్‌ స్ట్రిప్‌ను సైనిక అవసరాలకు నిర్మించారు. ఎయిర్‌పోర్టులు నిర్మించాలని ప్రతిపాదించిన ప్రాంతాల్లో అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)ని కన్సల్టెన్సీగా నియమించింది. ఈ సంస్థ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సెప్టెంబర్ నాటికల్లా నివేదిక అందజేయనుంది. ప్రతిపాదిత ప్రాంతాల్లో అసలు విమానాశ్రయాల అవసరం ఉందా, అక్కడ ట్రాఫిక్‌ ఏ స్థాయిలో ఉంటుంది, స్థలం ఎంత అవసరం ఉంటుంది అన్న అంశాలను ఏఏఐ అధికారులు పరిశీలించనున్నారు. పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇప్పటికే ఎయిర్ స్ట్రిప్‌లున్న సంగతి తెలిసిందే. వరంగల్ ఎయిర్ స్ట్రిప్‌ను సైనిక అవసరాలకు నిర్మించారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు ప్రభుత్వానికి నివేదిక అందచేయనున్నారు. నివేదిక ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ విధానాన్ని రూపొందిస్తాయి. ఇప్పటికే వరంగల్, కొత్తగూడెం, మహబూబ్ నగర్‌ జిల్లాల్లో ప్రతిపాదించిన ప్లేస్‌లను పరిశీలించింది.రెండో దశలో ఈనెల 19 నుంచి మూడు రోజుల పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో అధికారుల బృందం పర్యటించనుంది. ఆయా ప్రాంతాల్లో గడిచిన 5-6 దశాబ్దాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి.., ట్రాఫిక్ డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుంది.., విమానాశ్రయాల అవసరం ఉందా.., ఎంత స్థలం అవసరం తదితర వాటిపై అధికారులు పరిశీలన చేయనున్నారు.