హైద్రాబాద్, ఆగస్టు 29, (way2newstv.com)
ఉల్లిగడ్డ ఘాటెక్కింది. గత కొన్ని రోజులుగా.. స్వల్పంగా పెరుగుతూ వచ్చిన ఉల్లిగడ్డ ధర.. రెండు మూడ్రోజుల నుంచి స్పీడ్ పెంచింది. ప్రస్తుతం ఆనియన్ ధర… 40 రూపాయలకు చేరింది. పక్కరాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా దిగుబడి తగ్గటంతో ధర భారీగా పెరుగుతోంది. కేవలం 10 రోజుల్లోనే కిలో ఉల్లి ధర పది నుంచి 20 రూపాయలకు పెరిగింది.రాష్ట్రంలో ఉల్లి సాగు గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్ తో పాటు కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో సాగవుతుంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఆలస్యంగా కురిసిన వర్షాలు, భూగర్భ జలాల్లో భారీ తగ్గుదల కారణంగా సాగు సగానికి పడిపోయింది.
పది రోజుల్లో పెరిగిన రెట్టింపైన ఉల్లిధరలు
దీంతో రాష్ట్రం నుంచి వస్తున్న ఉల్లితో…. పూర్తిస్థాయిలో అవసరాలు తీరే అవకాశం లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది.సాధారణంగా రాష్ట్రానికి మహారాష్ట్రలోని షోలాపూర్, ఔరంగాబాద్, నాసిక్, కర్ణాటకలోని శివమొగ్గ, రాయచూర్ ప్రాంతాలు, మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటాం. అలాగే ఏపీలోని కర్నూలు నుంచి కూడా ఉల్లి సరఫరా అవుతుంది. అయితే ఈ ఏడాది మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసిన కుండపోత వర్షాలతో ఉల్లి సాగుకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో దిగుబడులు పూర్తిగా తగ్గాయి. మార్కెట్ లోకి వస్తున్న కొద్దిపాటి ఉల్లి ఆయా రాష్ట్రాల అవసరాలకే సరిపోతుండగా మిగతా వాటి కోసం దక్షిణాది రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. దీంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి.రెండు, మూడు రోజుల క్రితం వరకు హైదరాబాద్ మార్కెట్ లో క్వింటాల్ కు 2 వేల వరకు పలికిన ధర నిన్న 3 వేలకు పెరిగింది. గతేడాదితో పోలిస్తే మార్కెట్ లకు 4–5 వేల క్వింటాళ్ల మేర సరఫరా తగ్గిపోయింది. దీంతో హోల్ సేల్ ధరే కిలో 40 వరకు చేరింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెటింగ్ వర్గాలు అంటున్నాయి.
Tags:
telangananews