చెన్నై ఆగస్టు 12 (way2newstv.com):
తమిళనాడులోని కాంచీపురంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. కంచిలో గల అత్తి వరద రాజు స్వామి వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారికి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కేసీఆర్ దేవస్థానానికి చేరుకోగానే ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఒంటి గంటలకు సీఎం కేసీఆర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి కంచికి బయల్దేరి అతివరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అత్తివరద రాజస్వామిని దర్శించుకున్న కేసీఆర్
ఈ కార్యక్రమంలో కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్ నగరికి చేరుకున్నారు. ఆయనకు అపూర్వస్వాగతం లభించింది. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘన స్వాగతం పలికారు. తమిళనాడులోని కంచిలో ఉన్న శ్రీ అత్తివరద రాజ స్వామి ఆలయానికి సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా వెళుతున్న సంగతి తెలిసిందే. 2019, ఆగస్టు 12వ తేదీ సోమవారం ఉదయం రేణిగుంట విమానశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి కంచికి పయనమయ్యారు. సీఎం కేసీఆర్ పర్యటన రెండు గంటల పాటు ఆలస్యంగా కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ఫ్యామిలికి ఎమ్మెల్యే రోజా విందు ఇవ్వనున్నారు ఉదయమే అల్పహారం తీసుకోవడానికి ఏర్పాట్లు చేసినా..షెడ్యూల్ ఆలస్యం కావడంతో అది వీలు కాలేదు. కంచి దర్శనం అనంతరం తిరుపతికి వచ్చిన తర్వాత..రోజా ఇంటికి సీఎం కేసీఆర్ వెళ్లారు. అక్కడ పది నిమిషాల పాటు ఉన్నారు. ఇందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం. తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. తర్వాత హైదరాబాద్‌కు తిరుగు పయనం అయ్యారు. తమిళనాడులోని కంచిలో శ్రీ అత్తి వరద రాజ స్వామి ఆలయం పేరు గాంచింది. 40 ఏళ్లకు ఒకసారి అత్తి వరదరాజస్వామి దర్శనం ఉంటుంది. ఆగస్టు 17వ తేదీన దర్శనం ముగియనుంది. ఆగస్టు 18వ తేదీన స్వామిని తిరిగి పుష్కరిణిలో భద్రపరుస్తారు. మళ్లీ 2059లో అత్తి వరదరాజ స్వామి దర్శన భాగ్యం కలుగనుంది. దీంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. పలు సందర్భాల్లో తొక్కిసలాట జరిగింది. మళ్లీ 40 ఏళ్ల వరకు స్వామిని చూసే అవకాశం లేకపోవడం..భక్తులు ఎగబడుతున్నారు. సీఎం కేసీఆర్ కూడా దర్శనానికి వెళ్లారు.
Tags:
telangananews