కాకినాడ, ఆగస్టు 21, (way2newstv.com)
ఒక్క ఓటమి నాయకులకు అనేక పాఠాలు నేర్పుతుందని అంటారు. ఇప్పుడు ఇదే.. కొందరు నాయకులకు కంటిపై కునుకు కూడా లేకుండా చేస్తోంది. విషయంలోకివెళ్తే.. ఏమాత్రం ప్రజల్లో పట్టులేక పోయినా.. కేవల వార్డులకే పరిమితమైన నాయకులను కూడా తెచ్చి.. వైసీపీ అధినేత జగన్.. 2014లో ఎమ్మెల్యేలను చేశారు. వీరిలో ప్రముఖంగా వినిపించే పేరు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన వంతల రాజేశ్వరి. ఆమెకు స్థానికంగా పట్టున్నా.. ఎమ్మెల్యే రేంజ్‌లో ఆమెకు సీన్ లేదు. కానీ, జగన్ హవాతో నెట్టుకొచ్చిన ఆమె 2014లో విజయం సాధించింది. అప్పటి నుంచి వైఎస్ జగన్‌కు ఎంతో అభిమానిగా మారిపోయింది.ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని కూడా అనేక సభల్లో ప్రకటించింది. వాయిస్ చిన్నదే అయినా.. జగన్‌కు నమ్మకస్తురాలనే పేరు తెచ్చుకుంది.
వైసీపీ వైపు వంతల చూపు
అయితే, 2017లో చంద్రబాబు ఆకర్ష్ మంత్రంతో ఆమె కూడా పార్టీ మారి జగన్‌కు ఝలక్ ఇచ్చింది. టీడీపీలో చేరిపోయింది. జగన్‌పై ఎలాంటి విమర్శలు చేయకపోయినా.. చంద్రబాబు పాలనను మాత్రం మెచ్చుకునేది. ఇక, ఇటీవల ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ తెచ్చుకుని అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసినా,.. జగన్ సునామీ ముందు ఆమె కూడా ఓడిపోయింది. పైగా స్థానిక టీడీపీ నేతలు ఆమెను ఓన్ చేసుకోలేక పోతున్నారు. ఆమె కూడా వారితో కలిసి ముందుకు సాగలేక పోతోంది. రాజకీయంగా ఫ్యూచర్ కోసం రాజేశ్వరి ఫ్యామిలీ అల్లాడిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ నాలుగు రోజుల కిందట ఆమె భర్త.. స్తానిక వైసీపీ కార్యాలయానికి వచ్చి కీలక నేతలను కలిశారు. తమకు జగన్ అప్పాయింట్ మెంట్ ఇప్పించాలని వేడుకున్నారు. తాము తిరిగి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నామని, టీడీపీలో ఉండలేమని, తాము చేసింది తప్పేనని చెప్పారట. అయితే, వైసీపీ నాయకులు మాత్రం.. జగన్ ఇప్పుడు మీలాంటి వారిని చేర్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారని వేరే పార్టీ చూసుకోవాలని బదులిచ్చారట., దీంతో చిర్రెత్తుకొచ్చిన వంతల రాజేశ్వరి భర్త.. అందరూ చేసిందే మేం కూడా చేశామని, పార్టీ మారినంత మాత్రామ మేమేమన్నా ఉగ్రవాదులమా? అని ఎదురు ప్రశ్నించారట.అంతేకాదు, జగన్ అంటే మాకు ప్రాణం.. ఈ విషయం ఆయన ముందే తేల్చుకుంటామని శపథం చేశారట. మరి జగన్ వీరికి అప్పాయింట్ మెంట్ ఇస్తారా? వీరి కల నెరవేరుతుందా? చూడాలి. నిజానికి ఎన్నికలకు ముందు పార్టీ మారి.. టీడీపీలోకి వెళ్లిన వారు తిరిగి వైసీపీ గూటికి వస్తే.. కండువా కప్పి ఆహ్వానించారు. వీరిలో కర్నూలు అప్పటి ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్‌రెడ్డి వంటి వారు ఉన్నారు. కానీ, అప్పట్లో టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయి.. ఇప్పుడు వైసీపీ బాట పడతామంటే..జగన్ ఒప్పుకొనేది లేదని అంటున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి.
Tags:
Andrapradeshnews