పాత్రికేయుడిపై దాడిని ఖండించిన మాజీమంత్రి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పాత్రికేయుడిపై దాడిని ఖండించిన మాజీమంత్రి

అనంతపురం, ఆగస్టు 26, (way2newstv.com
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాంటి విలేకరులపై అధికార పార్టీ నాయకులు దాడి చేయడం దారుణమని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని  మహా  న్యూస్ ఛానల్ రిపోర్టర్ మనోహర్ పై అధికార పార్టీ నాయకులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడికి గురైన బాధితుడు అనంతపురం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మాజీ మంత్రి కాలవ అక్కడికి వెళ్లి బాధిత విలేకరిని పరామర్శించారు.
 పాత్రికేయుడిపై దాడిని ఖండించిన మాజీమంత్రి

ఈ సందర్భంగా మాజీ మంత్రి కాలవ మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతతకు కు మారుపేరైన రాయదుర్గంలో మహా న్యూస్ విలేకరి పై అధికార పార్టీ నాయకులు పాశవికంగా దాడి చేసి చంపేయాలని చూడడం దుర్మార్గపు చర్య అని ఖండించారు. విలేకరులపై భౌతిక దాడులకు దిగడంహమైన చర్య అని మనోహర్ కుటుంబం  ఉద్యోగాల్లో పనిచేస్తోందని, ఆయన భార్య అత్త ఇతర కుటుంబ సభ్యులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే ఇలా విలేకరులు పై దాడి చేయడం ఉద్యోగస్తుల పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దారుణమన్నారు. ఇప్పటికైనా దాడికి పాల్పడిన నిందితులను పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా విచారించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  విలేకరులపైనే ఇలా దాడులకు పాల్పడితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమని ప్రశ్నించారు.