టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్ ఆగష్టు 27 (way2newstv.com)
తెలంగాణ రైతుల పొలాలు పచ్చగా అవుతుంటే కాంగ్రెస్ నేతల కళ్లు ఎర్రబడుతున్నాయి అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ్‌భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలు విచక్షణ లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కాంగ్రెస్ నాయకులకు బుద్ధి రాలేదు. దేశంలో పార్టీ పరిస్థితి ఏంటో కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం లేక ఎక్కడికక్కడ ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ప్రజలు సుభిక్షంగా ఉంటే కాంగ్రెస్ నేతలకు నిద్ర పట్టడం లేదు.
రైతుల పొలాలు పచ్చగవుతుంటే కాంగ్రెస్ నేతల కళ్లు ఎర్రబడుతున్నాయి
ప్రజలు ఛీకొడుతున్నా కాంగ్రెస్ అవే ఆరోపణలు చేస్తోంది. పేదల పట్ల తాపత్రయం ఉన్న టీఆర్‌ఎస్ నాయకులను ఎవరూ ఏమీ చేయలేరు.దేశంలోనే ఎక్కడా లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. ఐదేళ్లలోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశమే అబ్బురపడే విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. కారుచీకట్ల నుంచి 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది. అందరికీ 24 గంటల విద్యుత్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. 50 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఏటా పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ. 12 వేల కోట్లు వెచ్చిస్తోంది. హైదరాబాద్‌లో శాంతి, భద్రతలు అద్భుతంగా ఉన్నాయి. గతంలో గణేష్ పండుగ వస్తే కర్ఫ్యూ విధించేవాళ్లు. ఇప్పుడు కర్ఫ్యూలు లేకుండా శాంతి భద్రతలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు. నగరంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం. గతంలో ఎండాకాలం వస్తే జలమండలి కార్యాలయం ముందు ప్రదర్శనలు జరిగేవి. నగరంలో తాగునీటి సమస్యను రైతుల పొలాలు పచ్చగవుతుంటే కాంగ్రెస్ నేతల కళ్లు ఎర్రబడుతున్నాయి ఘనత కేసీఆర్‌కే దక్కింది. గతంలో నిజాంపేట, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో 14 రోజులకోసారి నీళ్లు వచ్చేవి. ఇప్పుడు నిజాంపేట, కుత్బుల్లాపూర్‌లో రెండు రోజులకోసారి నీళ్లిస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు.