తెలుగుదేశం పార్టీ నేతల ధర్నా
రాజమహేంద్రవరం ఆగష్టు 5 (way2newstv.com):
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న తుగ్లక్ నిర్ణయాల కారణంగా రాష్ట్ర ప్రజలు కష్టాల్లోకి నెట్టబడుతున్నారు అని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. అన్న క్యాంటీన్ల మూసివేతకు నిరసనగా స్థానిక ప్రభుత్వాసుపత్రి సమీపంలోని అన్నా క్యాంటీన్ వద్ద రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నాలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్ మాట్లాడుతూ అన్న క్యాంటిన్లు మూసివేత తగదన్నారు. పేద ప్రజలకు పట్టెడన్నం పెట్టాల్సింది పోయి... వారి నోటి వద్ద నుంచి అన్నాన్ని లాగేయడం సరైన విధానం కాదు అన్నారు. అన్న క్యాంటిన్లు మూసి వేయడం వల్ల పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ కావాలంటే అన్నా క్యాంటీన్లకు రంగులు, పేరు మార్పు చేయాలి తప్పితే పేదల ఆకలి మీద కొట్టడం మంచిది కాదన్నారు.
అన్నా క్యాంటిన్ల మూయవద్దు..పేదల కొడుపై కొట్టొద్దు
ఎంతో మంచి ఆశయంతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన క్యాంటిన్లు పథకం పట్ల పేదల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి యర్ర వేణు గోపాల రాయుడు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఉన్న వ్యక్తిగత కక్షల నేపథ్యంలో పేదల కడుపు నింపుతున్న అన్నా క్యాంటీన్లను మూసివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అన్న క్యాంటిన్లు ప్రారంభించి కడుపు నింపిన చంద్రబాబు పట్ల ప్రస్తుతం జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల సానుభూతి పెరుగుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) మాట్లాడుతూ అన్న క్యాంటీన్లను పేరు మార్పు చేసి... లేదా రంగులు మార్చి పున ప్రారంభించి పేదల ఆకలి తీర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఒక అజ్ఞానవంతుడి పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని ప్రచారం చేసుకునే జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల పట్ల ఎందుకు మడం తిప్పుతున్నారని ప్రశ్నించారు. పోలవరం, అమరావతి నిర్మాణాలను నిలిపివేసి తిరోగమనంలో పెట్టారని, పెన్షన్లు కూడా పూర్తిస్థాయిలో ఇవ్వలేని పరిస్థితి జగన్ ప్రభుత్వంలో దాపురించిందని ఎద్దేవా చేశారు. అనంతరం అన్నా క్యాంటిన్ వద్ద పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు, మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాశి నవీన్, మాజీ కార్పొరేటర్లు ద్వారా పార్వతి సుందరి, ఇన్నమూరి రాంబాబు, రెడ్డి పార్వతి, కోసూరి చండీప్రియ, మర్రి దుర్గా శ్రీనివాస్, బెజవాడ రాజ్‌కుమార్, ఇన్నమూరి రాంబాబు, తంగెళ్ల బాబి, పాలవలసల వీరభద్రం, ధన, తంగేటి సాయి, నాయకులు కురగంటి సతీష్, కంటిపూడి రాజేంద్రప్రసాద్, బుడ్డిగ రాధ, బుడ్డిగ రవి, బూరడా భవానీ శంకర్, పితాని కుటుంబరావు, మరుకుర్తి రవి యాదవ్, ఇంజన సుధాకర్, కేబుల్ రవి, నక్కా దేవి, కంటిపూడి శ్రీనివాస్, మళ్ల వెంకటరాజు, మాలే వియలక్ష్మి, కొయ్యల రమణ, నల్లం ఆనంద్, కొమ్మా రమేష్, కవులూరి వెంకటరావు, మేరపురెడ్డి రామకృష్ణ, బొమ్మనమైన శ్రీనివాస్, కుడిపూడి సత్తిబాబు, నాయుడు, మురళి, బొత్స శ్రీను, ఈతలపాటి రవి, జాలా మధనం, గొర్రెల సత్యరమణి, తురకల నిర్మల, కర్రి రమణమ్మ, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Tags:
Andrapradeshnews