అక్టోబరు ఫస్ట్ నుంచి మద్యం పాలసీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అక్టోబరు ఫస్ట్ నుంచి మద్యం పాలసీ

విజయవాడ, ఆగస్టు 23(way2newstv.com):
ఏపీ రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ఇందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. విధి విధానాలను, నిబంధనలపై జీవో జారీ చేసింది దానికి సంబంధించిన శాఖ. ఏజెన్సీలో వైన్ షాపు ఏర్పాటుకు అక్కడి గ్రామ సభ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. తిరుపతి పవిత్రతను కాపాడే చర్యలు తీసుకోవాలని, తాగుడు మాన్పించేందుకు జిల్లాకో డీ - అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 
అక్టోబరు ఫస్ట్ నుంచి మద్యం పాలసీ

రాష్ట్రంలో 3 వేల 500 ప్రభుత్వ మద్యం షాపుల ఏర్పాటుకు సంబంధించి 2019-20 నూతన పాలసీని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2019, ఆగస్టు  22వ తేదీ గురువారం జోవోలు జారీ చేసింది. దీనిపై మద్యపాన నియంత్రణ కమిటీలు, ప్రజా, మహిళాలు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 
> ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా మద్యం దుకాణాల నిర్వాహణ.
> 21 ఏళ్ల లోపు ఉన్న వారికి లిక్కర్ ఇవ్వరు. అలాగే మద్యం మత్తులో ఉన్నా..యూనిఫాంలో ఉన్న సైనికులకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్న వారికి మద్యం > అమ్మకూడదు. 
> తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు వయా ఆర్టీసీ బస్టాండు, లీలా మహల్ సెంటర్, నంది సర్కిల్, విష్ణు నివాసం, శ్రీనివాసం, ఎస్వీఆర్ఆర్ ఆస్పత్రి, స్విమ్స్ రోడ్డులో మద్యం షాపులకు అనుమతినివ్వరు. 
> జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం దుకాణాల ఏర్పాటును అనుమతించరు.
> పాఠశాలలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, ప్రార్థనా మందిరాలకు వంద మీటర్లలోపు వైన్ షాపుల ఏర్పాటుకు అనుమతినివ్వరు. 
> మద్య పానం వల్ల జరిగే దుష్ర్పపరిణామాలను వెల్లడించేందుకు పెద్ద ఎత్తున అవగాహన శిబిరాలు ఏర్పాటు.
> ఏపీఎస్‌బీసీఎల్‌కు ఎక్సైజ్ కమిషనర్ లైసెన్స్ మంజూరు చేస్తారు. 
> ఏడాదికి రూ. వెయ్యి లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 
> లైసెన్స్ కాలపరిమితి ఈ ఏడాది అక్టోబర్ 01 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వరకు ఉంటుంది.