చంద్రబాబు పాపాలవల్లే ఈ కష్టాలు

ఏలూరు,  ఆగస్టు 09 (way2newstv.com):
గత ప్రభుత్వం కంటే వేగంగా వరద ముంపు గ్రామాల సమస్యపై వైపీపీ ప్రభుత్వం స్పందించిందని మంత్రి ఆళ్ల నాని అన్నారు.గోదావరి వరదలపై అధికారులతో సమీక్ష ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడు తూ ఢిల్లీలో ఉన్నప్పటికీ అక్కనుంచి ఎప్పటికప్పుడు నేరుగా వరద పరిస్ధితులను సీఎం సమీక్షించారని వెల్లడించారు. అదనంగా గోదావరి వరద సహాయక చర్యలు అందించాలని సీఎం సూచనలు చేశారని.. గత ప్రభుత్వంలో ఇటువంటి ఆలోచన చేయలేదన్నారు. ప్రతి కుటుంబానికి రూ.5 వేలు సహాయాన్ని అదనంగా అందించాలని ఆదేశించినట్టు చెప్పారు. 
 చంద్రబాబు పాపాలవల్లే ఈ కష్టాలు

వరదల వల్ల పంట మునిగిన రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు.పోలవరం కమీషన్ల కోసం చంద్రబాబు చేసిన పాపాల వల్ల ఇన్ని కష్టాలు వచ్చాయని, ఎటువంటి ప్రణాళికలు లేకుండా నిర్వాసితులను తరలించకుండా పోలవరం హెడ్ వర్క్ పనులను చేపట్టారని విమర్శించారు. చంద్రబాబు చేసిన పాపాలను ప్రజలు అనుభవించాల్సి వస్తోందని ఆళ్ల నాని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం వద్ద 27.7 మీటర్ల వరద నీటి మట్టం ఉందని, నిరంతరం సహాయక చర్యలు కొనసాగుతాయన్నారు. నిత్యావసర సరుకులు వరద బాధితులకు ఎప్పటికప్పుడు అందజేస్తున్నామని, వండిన ఆహార పదార్థాలు కూడా అందించామని తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో 4824 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని తెలిపారు.
Previous Post Next Post