వరంగల్ లో చైల్డ్ హెల్ప్ లైన్ ఏర్పాటు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వరంగల్ లో చైల్డ్ హెల్ప్ లైన్ ఏర్పాటు

వరంగల్ అర్బన్, ఆగస్టు 08,(way2newstv.com):
వివిధ కారణాల వలన తప్పిపోయిన, ప్రమాదకర పరిస్థితులలో సనిచేస్తున్న పిల్లలను గుర్తించడానికి మాత్రమే  పరిమితం కారాదని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్  అభిప్రాయపడ్డారు.  గురువారం వరంగల్ రైల్వే స్టేషన్ లో తరుణి స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో నెలకొల్సిన రైల్వే చైల్డ్  లైన్-1098 హెల్ప్  డెస్క్ ను పోలీస్ కమీఫనర్ డాక్టర్  వి.రవీందర్ తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. వరంగల్ లో త్వరలోనే భరోసా కేంద్రాన్ని ఏర్పాలు చేయనున్నట్లు తెలిపారు. 2015లో దేశవ్యాప్తంగా 20 రైల్వే స్టేషన్ లలో ప్రారంభించిన చల్డ్  హెల్ప లైన్- 1098 ను ప్రస్తుతం 512 రైల్వే స్టేషన్ కు ప్రభుత్వం  విస్తరించింది. తెలంగాణలో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఈ హెల్ప్ డెస్కలు పనిచేస్తున్నాయి. 
వరంగల్ లో చైల్డ్ హెల్ప్ లైన్ ఏర్పాటు

నాల్గవ కేంద్రంగా  వరంగల్ రైల్వే స్టేషన్ల లో  ఏర్పాటయింది. తప్పిపోయి రైల్వే స్టేషన్ లో గుర్తించిన పిల్లలతో పాటు, రైల్వే స్టషన్ లను కేంద్రాలుగా చేసుకొని యాచించడం, స్మగింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలలో పాల్గోంటున్న పిల్లలను పట్టుకుని వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చేందుకు దేశ వ్యాప్తంగా వున్న రైల్వే స్టేషన్లను అనుసంధానం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ డాక్టర్ వి.రవీందర్ మాట్లాడుతూ వివిధ కారణాల వలన బాల్యాన్ని కోల్పోతున్న పిల్లల సంరక్షణ మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ లో నెలకొల్పన చైల్డ్  హెల్పలైన్-1098కు పోలీస్ శాఖ పూర్తిగా సహకరిస్తుందని  తెలిపారు. హెల్ప్ లైన్ ద్వారా పట్టుకున్న పిల్లలను దేశవ్యాప్తంగా అన్ని పోలిస్ స్టేషన్ తో అనుసంధానం చేయబడిన ఫేస్ రీడింగ్ సిష్టం ద్వారా గుర్తించి  వారి తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు తెలిపారు. రైల్వే డివిజన్ పోలీస్ కమాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ తప్పిపోయిన పిల్లల సంరక్షణకు రైల్వే చైల్డ్ హెల్ప్ లైన్-1098 నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. రైళ్లు లో జరిగే దోపిడిలు, బెదిరింపులు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు, ప్రమాదాల  సమాచారాన్ని రైల్వే టోల్ ఫ్రీ నెం-182  కు తెలియజేయాలని ప్రయాణికులకు సూచించారు. వెంటనే ఆయా రైళ్లలో ఉన్న రైల్వే పోలిస్ లతో పాటు సమీపంలోని రైల్వే స్టేషన్ యంత్రాంగం  స్పందిస్తుందని  తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా చైల్డ్ హెల్స్ లైన్-1098 లో వాలంటీర్లుగా విధులు నిర్వహించేందుకు నియమితులైన యువతకు గుర్తింపు కార్డు లను జిల్లా ప్రశాంత్ పాటిల్ , పోలీస్ కమీషనర్ డాక్టర్.వి.రవీందర్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో  తరుణి ఎన్.జి.ఓ.వ్యవస్థాపకులు డాక్టర్ మమత రఘువీర్, జిల్లా సంక్షేమ అధికారి సబిత, డిసిపిఓలు-పి.సంతోష్ కుమార్, జి.మహేందర్ రెడ్డి, అసిస్టెంట్ కమీషనర్ పి. రామమూర్తి, చైల్డ్ వేల్ఫేర్ కమిటి చైర్మన్ ఎం.పరశురాములు, తదితరులు పాల్గొన్నారు.