జోష్ నింపిన నడ్డా పర్యటన - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జోష్ నింపిన నడ్డా పర్యటన

హైదరాబాద్, ఆగష్టు 19 (way2newstv.com)
బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా  రెండు రోజుల పర్యటన తో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో  సమరోత్సాహాన్ని నింపింది. ఆదివారం ఉదయం  శంషాబాద్ ఎయిర్ పోర్ట్  చేరుకున్న నడ్డా కు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఘన స్వాగతం పలికింది. తరువాత  కాన్వాయ్ లో బయలుదేరిన రాష్ట్ర నేతలు అసెంబ్లీ ముందు నుంచి నడ్డా తో పాటు ర్యాలీ నిర్వహించారు.  ర్యాలీ బీజేపీ కార్యకర్తలకు అబివాదం చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు నడ్డా. రాష్ట్ర నేతలతో కలసి రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న నడ్డా కు అప్పటికే పార్టీ కార్యాలయానికి చేరుకున్న రాష్ట్ర , జిల్లా నేతలు స్వాగతం పలికారు. అనంతరం కొద్ది సేపు పార్టీ నేతలతో పరిచయ కార్యక్రమాలు జరిగాయి. 
జోష్ నింపిన నడ్డా పర్యటన

ఆ తర్వాత మధ్యాహ్నం పార్టీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ ప్రారంభం అయింది. మున్సిపల్ ,కార్పోరేషన్ లలో పార్టీ అవలంబించాల్సిన వ్యూహం పై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసారు నడ్డా. సమావేశం అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ బహిరంగ సభకు చేరుకున్న నడ్డా, అక్కడ  దాదాపు  40 నిమిషాలు ప్రసంగించారు...మొదట నడ్డా స్పీచ్ కాస్తా బోర్ అనిపించినా ఆ తర్వాత కాంగ్రెస్ ,టిఆర్ఎస్ ల టార్గెట్ గా నడ్డా స్పీచ్ సాగడంతో కార్యకర్తలల్లో మంచి జోష్ వచ్చింది.  బహిరంగ సభ ముగిసిన అనంతరం పార్టీ కార్యాలయంలో లో  లక్ష్మణ్ అధ్యక్షతన  కోర్ కమిటీ సమావేశం జరిగింది..పార్టీ సంస్థాగత నిర్మాణం తో పాటు ,మెంబర్ షిప్ డ్రైవ్, టిఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. దీంతో పాటు బీజేపీ లో చేరేందుకు సిద్దంగా ఉన్న నేతలెవరు. ఇంకా ఎవరెవరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే దాని పై నడ్డా ఆరా తీసారట. ఇక సోమవారం ఉదయం ముషీరాబాద్ ,బాగ్ లింగంపల్లి పార్టీ నేతలు ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొని పలువురు పార్టీ కార్యకర్తలకు పార్టీ సభ్యత్వం ఇచ్చారు.. అనంతరం అంబేద్కర్ కాలేజీలో మొక్కలు నాటారు. నడ్డా టిఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం వల్ల టిఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ చేసే ఆరోపణలకు ఈ విమర్శల ద్వారా నడ్డా సమాధానం చెప్పినట్లు అయింది .అటు కాంగ్రెస్ ను కూడా అదే స్దాయిలో విమర్శించారు. భవిష్యత్ లో టిఆర్ఎస్ అవినీతి పచ తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామంటూ నడ్డా ప్రకటించడంతో  ఫ్యూచర్ లో బీజేపీ శ్రేణులు రోడ్ల పైకి రావాల్సి ఉంటుందని పార్టీ నేతలకు హెచ్చరించినట్లయింది. పార్టీ లో చేరికల ద్వారా తెలంగాణ లో బీజేపీ బలపడుతుందనే అభిప్రాయం ను ప్రజల్లో కలిగించే ప్రయత్నం బీజేపీ చేసిందనే చెప్పుకోవాలి. ప్రతి నెలా జాతీయ నాయకులు రాష్ర్టానికి వస్తారని అమిత్ షా చెప్పినట్లు గానే ఈ నెల నడ్డా వచ్చారు..ఇక వచ్చేనెల సెప్టెంబర్ 17న అమిత్ షా వస్తారని పార్టీ నేతలు చెపుతున్నారు.