ఇవాళ్టి నుంచి అధికారికం.... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇవాళ్టి నుంచి అధికారికం....

బీఆర్కే భవన్ లోనే అంతా
టీ ఆకారంలో సచివాలయ భవనాలు
హైద్రాబాద్, ఆగస్టు 12, (way2newstv.com)
బూర్గుల రామకృష్ణారావు భవన్ వేదికగా ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. బిఆర్‌కె భవన్‌లో ఏర్పాటు చేసిన తన చాంబర్‌లోకి శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి తన చాంబర్‌కు వచ్చారు. శ్రావణ శుక్రవారం, దశమి ఒకేసారి రావడంతో ఈ దివ్యమైన ఘడియల్లో పనులు ప్రారంభించి కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు బిఆర్‌కె భవన్‌కు వచ్చి తమ చాంబర్‌లో కూర్చొని వెళ్లారు. వరుసగా 3 రోజులు ప్రభుత్వ సెలవులు పూర్తి కావడంతో ఇవాళ్టి నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచే అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. వసతులు, సౌకర్యాలు ఎలా ఉన్నా ప్రభుత్వం ప్రతిపాదించిన భవనాల్లోకి సచివాలయ కార్యాలయాలను తరలించాలని సిఎస్ అన్ని శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. కొన్ని శాఖలు కావాలనే ఫర్నీచర్‌తో పాటు సామగ్రిని తరలించడానికి సిద్ధం కాకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసిం ది.

ఇవాళ్టి నుంచి అధికారికం....

అన్ని శాఖల ముఖ్యకార్యదర్శుల కార్యాలయాలను ప్రతిపాదించిన భవనాల్లోకి మార్చాలని టెక్నికల్ కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో కచ్చితంగా ఆదేశాలు పాటించాలని సిఎస్ వారికి సూచించినట్టుగా సమాచారం. ఇప్పటి కే బిఆర్‌కె భవన్‌లో ప్రభుత్వశాఖల కార్యాలయాలు సిద్ధం కావడంతో కొన్ని శాఖల ఫర్నీచర్‌ను అక్కడకు తరలించా రు. కార్యాలయాలను సూచించే బోర్డులను సైతం పెట్టా రు. అధికారులకు పార్కింగ్ వసతి కల్పించారు. ప్రత్యేక భద్రతా దళం భద్రతా ఏర్పాట్లను సైతం చేపట్టింది.కార్యాలయాల తరలింపు నేపథ్యంలో ఆర్థిక శాఖలో సిబ్బంది సెలవులను కూడా రద్దు చేశారు. సెక్షన్లను వెంట నే తరలించాలని పిఎఫ్‌ఎస్ ఆదేశాలు అందాయి. మరోవైపు బూర్గుల రామకృష్ణారావు భవన్ పూర్తిగా ఎస్పీఎఫ్ భద్రతావలయంలోకి వెళ్లిపోయింది. సిఎస్‌ఓ త్రినాథ్ కూడా సెక్రటేరియట్ నుంచి బిఆర్‌కె భవన్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లోకి మారారు. మిగతా మంత్రుల ఛాంబర్లు, వాళ్ల పేషీలకు బిఆర్‌కె భవన్ మొదటి అంతస్తును కేటాయించారు. పలువురు మంత్రులు మాత్రం వారి వారి శాఖల హెచ్‌ఓడీల్లోకి మారేందుకే మొగ్గు చూపుతున్నారు.అటు సచివాలయం కూల్చివేతలను ప్రారంభించాలని సిఎం కెసిఆర్ ఇప్పటికే అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ ఉపసంఘంతో పాటు సాంకేతిక కమిటీ పనులను వేగవంతం చేసింది. ఇప్పుడు న్న సచివాలయాన్ని కూల్చివేసి వాస్తుకు అనుకూలంగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శ్రావణమాసం లో కొత్త సచివాలయానికి సంబంధించి నిర్మాణాలను ప్రారంభించనున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన డిజైన్లు వారంలోగా ఖరారు కానున్నట్టుగా సమాచారం.ఇప్పుడున్న సచివాలయం రెండు బ్లాకులను కలుపుకొని 18 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రస్తుత స్థానంలోనే కొత్త సచివాలయం నిర్మించాలన్న నిర్ణయం తరువాత పక్కను న్న విద్యుత్ శాఖ భవనాలు, హెలీఫ్యాడ్‌ను కలుపుకుంటే ఈ విస్తీర్ణం 23 ఎకరాలకు పెరుగుతుంది. ఎ,బి,సి,డి బ్లాక్‌లను కూల్చివేసి భూగర్భంలో ఆరు అంతస్థుల పార్కి గ్ కాంప్లెక్స్, పైన 8 అంతస్థుల పరిపాలనా భవనాలను నిర్మించేందుకు రోడ్లు, భవనాల శాఖ ఇంజనీరింగ్ నిపుణులు రోడ్డు మ్యాప్‌ను తయారుచేసి ఇటీవలే సిఎంకు అందజేశారు. ‘యు’ ఆకారంలో ఈ భవనాలు నిర్మించాలని భావించినప్పటికీ కొన్ని మార్పులు చేసి‘టి’ ఆకారంలో నిర్మించాలని సిఎం సూచించారు.