హరితహారం వేగవంతం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హరితహారం వేగవంతం

వనపర్తి, ఆగస్టు 3 (way2newstv.com):
ఇప్పుడు వర్షాలు ఊపందుకోవడంతో హరితహారం కార్యక్రమం కింద అధికంగా  మొక్కలు నాటాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన వనపర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో జహీరాబాద్ ఎంపీ బి బి పాటిల్ , రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ ల తో కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ఈ సంవత్సరం హరితహారం కార్యక్రమం కింద కోటి అరవై ఏడు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని, అయితే ఇప్పటివరకు 15 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. వర్షాలు ఆలస్యం కావడం, అంతేకాక వర్షాలు వచ్చిన సరైన మోతాదులో కురవకపోవడం వంటి కారణాల వల్ల హరిత హారం ఆలస్యమైందని, ప్రస్తుతం వర్షాలు ఊపందుకున్న నందున కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కోరారు. 
హరితహారం వేగవంతం

రాబోయే రోజుల్లో మొక్కలు నాటి శాతం ఉదృతంగా పెరగాలని, ముఖ్యంగా  అటవీ శాఖ, మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్ల సహకారంతో ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.రాష్ట్ర ముఖ్యమంత్రి శుక్రవారం జిల్లా పర్యటన సందర్భంగా కూడా హరితహారం కార్యక్రమాన్ని ప్రస్తావించారని, వారి చొరవను ఆదర్శంగా తీసుకొని జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి రిజర్వు ఫారెస్టు శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందని మంత్రిఅన్నారు.  104 సంవత్సరాల వయసులో తన మాతృమూర్తి తారకమ్మ మృతి చెందిందని, ఆమె జ్ఞాపకార్థం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 104 మొక్కలు నాటుతున్నట్లు మంత్రి తెలిపారు. జహీరాబాద్ ఎంపీ బి బి పాటిల్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ముఖ్యంగా రాష్ట్రంలో 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి తీసుకురావడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమం లో మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. మొక్కలు నాటడం వల్ల ఆ ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని అన్నారు.      ఈ కార్యక్రమంలో  జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకేనాథ్ రెడ్డి , కౌన్సిలర్లు వాకి శ్రీధర్, గట్టు యాదవ్, డిఎఫ్ ఓ,బాబ్జి రావు, మున్సిపల్ కమిషనర్ రజినీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.