చంద్రబాబు కొంప ఎప్పుడో మునిగిపోయింది - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చంద్రబాబు కొంప ఎప్పుడో మునిగిపోయింది

తాడేపల్లి ఆగష్టు 17 (way2newstv.com)
కృష్ణా నదిలో ఈ స్థాయి వరద అరుదు, 10 ఏళ్ల క్రితం వచ్చింది. ప్రజలు ప్రాజెక్టుల దగ్గరికి వెళ్లి కృష్ణా ప్రవాహం చూసి ఆనందిస్తున్నారు. అందరూ ఆనందంగా ఉంటే ఒక కుటుంబం బాధగా ఉంది. కృష్ణా నది వరద నా కొంప ముంచడానికి అని చంద్ర బాబు ఆందోళన చెందుతున్నారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. హై సెక్యురిటి జోన్ లో ఉన్న చంద్రబాబు ప్రమాదకరమైన ఇంట్లో ఎందుకు వుంటున్నారు. 
చంద్రబాబు కొంప ఎప్పుడో మునిగిపోయింది

370 రద్దుతో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వచ్చినంత కోపం చంద్రబాబు కు వచ్చింది. అక్రమ కట్టడమని, నది ప్రవాహంలో ఉందని ముఖ్యమంత్రి  జగన్ ముందే చెప్పారు. అయినా చంద్రబాబు తప్పని తెలిసికూడా మొండిగా అక్కడే వుంటున్నారు. రాజకీయంగా చంద్రబాబు కొంప ఎప్పుడో మునిగిపోయింది. నీచమైన ప్రచారాల వల్లే ప్రజలు మిమ్మల్ని ఛీ కొట్టారు. ఇంటి విషయంలో తప్పు చేస్తూ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అనేక తప్పులు చేస్తున్నారు. నోటీస్ ఇచ్చేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బంది ని కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు. చంద్రబాబు తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవడం మంచిదనిఅయన  సూచించారు. చంద్రబాబు తప్పును సరిదిద్దుకోకపోతే ప్రకృతి ప్రకోపానికి గురి అవుతారు. మీక్షేమం కోసం చెబుతున్నాం. ఐదేళ్లు ముఖ్యమంత్రి గా ఉండి చంద్రబాబు అమరావతి లో సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదని అయన ప్రశ్నించారు.