జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష

స్పందనపై జాగు తగదని సూచన
అమరావతి,ఆగస్టు 27, (way2newstv.com)
స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి జిల్లా ల వారీగా వీక్లీ రివ్యూ జరిపారు. ఎందుకు అర్జీదారులను ఎక్కువసేపు నిలబెట్టుకుంటున్నారని జిల్లాల కలెక్టర్ లను అయన  ప్రశ్నించారు. చేతి రసీదు ఇచ్చి తరువాత కంప్యూటర్ లోకి ఎక్కించాలని సూచించారు. అన్నీ జిల్లాల కలెక్టర్ లను నా కలెక్టర్ లుగా భావిస్తున్నాను.  ఇంటిస్థలాల ను లబ్ది దారులకు అందచేసే విషయం లో శ్రద్ద వహించాలని కోరారు. సెప్టెంబర్ నెలాఖరు కు సొంత ఆటో కలిగిన వారిని వాలంటరీ ల ద్వారా గుర్తించి వారికి ఇచ్చే డబ్బులు వారికి అందే విధంగా చూడాలి అని తెలిపారు.ఆ డబ్బులు పాత అప్పుల కు జమ కాకుండా పది వేల రూపాయలను ఇవ్వాలని తెలిపారు. సెప్టెంబర్ 15 న రైతు భరోసా మీద దృస్థి పెట్టాలని సూచించారు. 
జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష

నవంబర్ 21 న చేపల వేట చేసే వారికి వెయ్యి రూపాయలు ఇవ్వబోతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. డీజల్ సబ్సిడీ కూడా డీజిల్ పట్టించుకునే తప్పుడే ఇవ్వడం జరుగుతోంది.  డిసెంబర్ 21 న మగ్గం ఉన్న ప్రతి చేనేత వారికి 24000/- ఇవ్వబోతున్నాం. జనవరి 26 అమ్మఒడి ప్రారంభించబడుతుంది.  ఫిబ్రవరి లాస్ట్ వీక్,షాప్ లు ఉన్న టైలర్, రజకులుకు వైస్. ఆర్.పెళ్లి కానుక ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. మార్చి మూడవ వారంలో దేవాలయాలు,  చర్చి ల కు సంబంధించి మార్చి  నెకాఖరుకు 25 లక్షల స్థలాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుండి ఆగిగోల్డ్ వారికి నిధుల చెల్లింపులుంటాయిన అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల ను ప్రభుత్వం అమ్మే బాధ్యత తీసుకుందని ముఖ్యమంత్రి తెలిపారు.
ప్రతి 2000 జనాభా కు ఒక పంచాయతీ కార్యాలయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. క్రీడాకారుల కు ప్రతి సంత్సరం నేషనల్ లెవెల్ లో కీర్తి పొందిన వారికి అగస్ట్ 29 న గోల్డ్,సిల్వర్,మెడల్స్ వారీగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని  సూచించారు. గ్రామ సెక్రటేరియట్ లో కచ్చితంగా అన్నీ వసతులు ఉండాలి. ఎరువులు అమ్మే విధంగా సెక్రటేరియట్ పక్కనే ఏర్పాట్లు చేయాలని కోరారు. ప్రకృతి సేద్యం గురించి కూడా చర్యలు చేపట్టాలని కోరారు.