అమరావతి ఆగస్టు 27, (way2newstv.com)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజధాని రైతుల నిరసన సెగలు తగిలాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులంతా ఏకమై నినాదాలు చేశారు. రాజధాని మార్పు అంశంపై రైతులు గ్రామస్థాయిలో ఆందోళన చేపట్టగా రైతుల సెగ ఒక్కసారిగా ముఖ్యమంత్రికి తగిలింది. మంగళగిరి మండలం, కృష్ణాయపాలెం వద్ద రాజధాని రైతులు జగన్ కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేసి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాజధాని రైతుల అందోళన
మంత్రులు చేస్తున్న ప్రకటనలలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రైతులకు సమాధానం చెప్పాలని, స్పష్టమైన ప్రకటన చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ జగన్ కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని పక్కకు తరలించారు. కాగా ఈ సంఘటనపై పోలీసులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు వరుసగా ఆందోళన బాట పట్టారు. గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, ఎర్రబాలెం గ్రామంలో రాజధాని రైతులు రోడ్డెక్కారు. పార్టీలకు అతీతంగా రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తున్నారు. ప్రతి నెలా జీతం తీసుకుంటున్న మంత్రి బొత్సాకు రైతుల కష్టాలు తెలియకపోవడం బాధాకరమని అన్నారు.