సీనియర్ మంత్రిపై జగన్ గుస్సా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సీనియర్ మంత్రిపై జగన్ గుస్సా

విజయనగరం, ఆగస్టు 6, (way2newstv.com)
ఊత్తరాంధ్రలో సీనియర్ బీసీ నాయకుడు. మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో తలపండినవాడు. పదేళ్ళ పాటు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నేత. ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా అనేకసార్లు గెలిచి సత్తా చాటుకున్న బొత్స సత్యనారాయణ అలియాస్ సత్తిబాబుకు ఇపుడు ఎక్కడలేని దిగులు పట్టుకుందట. అయిదేళ్ళ పదవీ వియోగం తరువాత అధికారంలోకి వచ్చామన్న ఆనందం అసలు లేదట. ప్రతిపక్షంలో ఉన్నపుడు తనకు ఎంతో విలువ ఇచ్చిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పక్కన పెడుతున్నారని బొత్స సత్యనారాయణ తీవ్రమైన అసంత్రుప్తితో ఉన్నారట. జూనియర్లకు ఇచ్చిన విలువ కూడా తనకు ఇవ్వడంలేదని ఆయన వాపోతున్నారట.
 సీనియర్ మంత్రిపై జగన్ గుస్సా
బొత్స సత్యనారాయణకు జగన్ విపక్షంలో ఉన్నపుడు విలువ ఇచ్చారంటే అది రాజకీయ అవసరం. బొత్స సత్యనారాయణని నాడు పక్కన పెడితే పార్టీ ఇబ్బందులో పడుతుందని ఆయన సమయానుకూల తెలివిడి ప్రదర్శించారు. అయితే ఇపుడు ఎటూ వైసీపీ అధికారంలోకి వచ్చింది, అందువల్ల క్రమంగా బొత్స సత్యనారాయణ ప్రాధాన్యత తగ్గిస్తున్నరని అంటున్నారు. సత్తిబాబు వైఎస్సార్ క్యాబినెట్లో మంత్రిగా ఉంటూ ఓక్స్ వ్యాగన్ కుంభఖోణంలో ఇరుక్కున్న సంగతి జగన్ కి తెలియనిది కాదు, అదే విధంగా కాంగ్రెస్ లో ఉంటూ వైఎస్సార్ చనిపోగానే ప్లేట్ ఫిరాయించి జగన్ ని, ఆయన కుటుంబాన్ని నానా మాటలు అన్న గత చరిత్ర కూడా జగన్ కి ఇంకా గుర్తుందంటున్నారు. ఇక నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి పొగపెట్టి మరీ చివరి మూడు నెలలైనా సీఎం కావాలని బొత్స సత్యనారాయణ చేసిన ప్రయత్నాలు కూడా జగన్ మరచిపోలేదు. అంతే కాదు, విభజన తరువాత కాంగ్రెస్ నుంచి టీడీపీ, బీజేపీలలో చేరేందుకు ట్రై చేసి ఎక్కడా కుదరక చివరికి వైసీపీలో చేరారన్న సంగతి కూడా జగన్ కి ఇంకా బాగా తెలుసు. దీన్ని బట్టి జగన్ అర్ధం చేసుకున్నది బొత్స సత్యనారాయణ రాజకీయ అవసరం కోసమే వైసీపీలో ఉంటున్నారని, సమయం వస్తే ఎంతకినా తెగిస్తారని.ఇక బొత్స సత్యనారాయణ పనితీరు విషయంలోనూ జగన్ అసంత్రుప్తిగా ఉన్నారని సమాచారం. సీనియర్ మంత్రిగా సభలో ఆయన తనదైన అనుభవాన్ని చూపించడంలేదని కూడా జగన్ భావిస్తున్నారట. జూనియ‌ర్ ఎమ్మెల్యేలు, మంత్రులు దూకుడుగా ఉంటే బొత్స సత్యనారాయణ మాత్రం వెనకబడ్డారని జగన్ మార్కులు వేశారు. కీలకమైన మునిసిపల్ శాఖా మంత్రిగా బాధ్యతలు ఇచ్చినా కూడా ఎక్కడా బొత్స సత్యనారాయణ తనదైన మార్క్ చూపించలేదని కూడా జగన్ గుస్సా అవుతున్నారు. ఇక విజయనగరం జిల్లాలో గ్రూపులు కట్టడం, తనదే మొత్తం హవా అని శాసించడం వంటివి జగన్ కి అసలు నచ్చదు. అక్కడ కోలగట్ల వీరభద్రస్వామి, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, రాజన్న దొర వంటి వారిని పక్కన పెట్టి బొత్స సత్యనారాయణ తన హవా చాటుకోవాలని చూడడం కూడా జగన్ ద్రుష్టికి రావడంతో రాజకీయంగా కత్తెర వేయాలని డిసైడ్ అయ్యారట. రానున్న రోజుల్లో జగన్ మరిన్ని షాకులు బొత్స సత్యనారాయణకు ఇస్తారని అంటున్నారు. మరి బొత్స సత్యనారాయణ తన తీరు మార్చుకుంటారా లేఅదా అన్న దాని బట్టే విజయనగరం జిల్లా రాజకీయాలు అధారపడి ఉంటాయి.