శ్రీశైలం జలాశయానికి భారీ స్థాయిలో వరద నీరు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శ్రీశైలం జలాశయానికి భారీ స్థాయిలో వరద నీరు

కర్నులు, ఆగస్టు 8(way2newstv.com):
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీ స్థాయిలో వరద నీరు పోటెత్తుతోంది. ఆల్మట్టి, భీమా నది నుంచి వస్తున్న వరద నీటితో కలిసి గురువారం సుమారు 4లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో డ్యామ్‌లో 153 టీఎంసీల నీటి నిల్వ ఉండి.. నీటిమట్టం 872.60 అడుగులకు చేరింది.వరద ప్రవాహంతో శ్రీశైలం డ్యామ్ గురువారం రాత్రికి పూర్తిస్థాయిలో నిండుతుందని జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు. 
 శ్రీశైలం జలాశయానికి భారీ స్థాయిలో వరద నీరు

దీంతో శుక్రవారం మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ చేతుల మీదుగా గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. 2009లో వరదల తర్వాత శ్రీశైలం జలాశయానికి 4లక్షల క్యూసెక్కుల నీరు రావడం ఇదే తొలిసారని చెబుతున్నారు. వరద నీటితో డ్యామ్ వద్ద జలకళ సంతరించుకుంది. దీంతో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రానికి 32వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో సామర్థ్యానికి మించి 17.5మిలియన్ల యూనిట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. భారీ వర్షాలతో అటు కర్ణాటకలోనూ జలకళ సంతరించుకుంది. వరద నీటితో జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. రాష్ట్రంలోని సగానికి పైగా జలాశయాల్లో నీటి నిల్వ ప్రమాదపు స్థాయికి చేరుకుంది. రాష్ట్రంలో మరో 3రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేయడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఉత్తర కర్ణాటకలోని ఐదు జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.