హైద్రాబాద్, సెప్టెంబర్ 18,(way2newstv.com)
మిషన్‌కాకతీయ పథకానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. శాసనసభలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానమిస్తూ.. మిషన్‌కాకతీయ పథకంలో పునరుద్దరించిన చెరువులతో 14లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరిచ్చినమన్నారు.
మిషన్ కాకతీయతో 14లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరి
మిషన్‌కాకతీయపై నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ డాక్యుమెంటరీ రూపొందించిందని చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసుకుంటున్నమని వెల్లడించారు. మిషన్‌కాకతీయకు కేంద్ర ఎలాంటి సాయం చేయలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం లక్షా 17వేల 714పోస్టులు భర్తీ చేశాం. మరో 31,668 పోస్టుల నియామకాల ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. పోస్టుల భర్తీకి సంబంధించి 900 కేసులు కోర్టుల్లో ఉన్నాయని హరీశ్‌రావు వివరించారు.