నెల్లూరు, సెప్టెంబర్ 04 (way2newstv.com)
ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ -2 ప్రాజెక్టు ఇస్రో కలలను నిజం చేయబోతుంది భూమి పై నుండి ప్రయాణం ప్రారంభించి 45 రోజులుగా ఎన్నో కీలక ముందడుగులు వేస్తూ ముందుకు సాగి పోతున్న చంద్రయాన్-2 సోమవారం మధ్యాహ్నం ఆర్బిటర్ నుండి విక్రమ్ ల్యాండర్ విడిపోయిన తరువాత రెండు సార్లు ల్యాండర్ ను చంద్రునికి అత్యంత చేరువగా తీసుకువచ్చే ప్రక్రియను ఇస్రో పూర్తి చేసింది.
చంద్రయాన్-2 ల్యాండింగ్ కు సిద్ధం
ఈ తెల్లవారుజామున 3 :42 గం!! సమయం లో 9 సెకండ్లు పాటు ప్రోప్లీన్ట్ సిస్టం ను ఉపయోగించి ల్యాండర్ ను చంద్రునికి 35 కిలోమీటర్లు దగ్గరగా 101 కిలోమీటర్లు దూరపు వృత్తాకారపు కక్ష లోకి చేరుకుంది ఇక్కడనుండి 7 వ తేదీ తెల్లవారుజామున 1 :40 నుండి 1 :55 మధ్య సమయం లో ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువం పై దిగుతుంది అనంతరం నాలుగు గంటల సమయం తరువాత ల్యాండర్ లోపల ఉండే రోవర్ బయటకు రావడం జరుగుతుంది అక్కడ నుండి ప్రజ్ఞాన్ రోవర్ 14 రోజుల పాటు చంద్రుని ఉపరితలం పై తిరుగుతూ సమాచారాన్ని భూమికి అందిస్తుంది ఆర్బిటర్ మాత్రం ఏడాది పాటు చంద్రుని చుట్టూ తిరుగుతూ పరిశోధనలు చేస్తూ సమాచారాన్ని అందిస్తుంది