23 మందిలో ఒక్కళ్లు...ఇద్దరే యాక్టివ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

23 మందిలో ఒక్కళ్లు...ఇద్దరే యాక్టివ్

విజయవాడ, సెప్టెంబర్ 14, (way2newstv.com)
అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తన పార్టీలో చేర్చుకున్నారు. ఈ 23 మందిలో ఒక్క అద్దంకి ఎమ్మెల్యే గొట్టి పాటి రవికుమార్ తప్పమరెవరూ గత ఎన్నికల్లో గెలవలేదు. కొందరికి చంద్రబాబు టిక్కెట్లు ఇవ్వలేదు. టిక్కెట్లు ఇచ్చినా ఓటమి పాలయిన వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. పార్టీపటిష్టత కోసం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీలో చేర్చుకుంటే ఇప్పుడు అధికారం కోల్పోగానే వారిలో చాలామంది పార్టీకి దూరంగానే ఉంటున్నారు.2014 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసే తాము పార్టీలోకి వెళుతున్నామని జంప్ అయ్యే ప్రతి ఎమ్మెల్యే అప్పట్లోప్రకటన చేసి వెళ్లిపోయారు.
23 మందిలో ఒక్కళ్లు...ఇద్దరే యాక్టివ్

ఇందులో నలుగురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవి కూడా ఇచ్చారు. మంత్రిపదవి దక్కించుకున్న నలుగూరు 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ 23 మందిఅప్పట్లో అధికారికంగా పార్టీలో చేరినప్పటికీ వారిని లోకల్ లీడర్లు దరి చేరనీయలేదు. అయితే అప్పట్లో ఎమ్మెల్యే కావడంతో కొంత సర్దుబాటును చేసుకోగలిగారు.2019 ఎన్నికలకు వచ్చేసరికిఎమ్మెల్యేలు చెప్పినట్లు ప్రజలకు ఏపీలో అభివృద్ధి కన్పించలేదులా ఉంది. అందుకే టీడీపీ ఘోర పరాజయం పాలయింది. ఇప్పుడు ఆ పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. చంద్రబాబు ఒక్కరే పోరాటంచేస్తున్నారు. టిక్కెట్లు పొంది, అధికారంలో ఉన్నప్పుడు అనుభవించిన నేతలు కొందరు సైడయి పోయారు. ఈ 23 మందిలో కూడా కొందరు పార్టీని వీడారు. ఉన్న వారిలో ఎక్కువ మంది పసుపుజెండాకు దూరంగా ఉంటున్నారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరుతున్నారు. ఎస్వీ మోహన్ రెడ్డి, పాలపర్తి డేవిడ్ రాజులు తిరిగి వైసీపీ గూటికి చేరారు.వైసీపీని వీడి టీడీపీలో చేరినవారిలో గిడ్డి ఈశ్వరి, కలమల వెంకటరమణ, వంతల రాజేశ్వరి, ఉప్పులేటి కల్పన, జలీల్ ఖాన్, గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు, అశోక్ రెడ్డి, సునీల్ కుమార్, జయరాములు, బుడ్డారాజశేఖర్ రెడ్డి, మణిగాంధీ, చాంద్ భాషా వంటి నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీని వీడి రావడం, అప్పటికే టీడీపీలో నేతలు ఉండటంతో వీరి పని రెంటికి చెడ్డ రేవడిగాతయారయింది. అందుకే ఇప్పుడప్పుడే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే ఆలోచన వారు చేయడం లేదు. భవిష్యత్తులో అవకాశం ఉన్న పార్టీలోకే వెళదామని నిర్ణయించుకున్నట్లుంది. ఒకరకంగా 23మందిలో ఎక్కువ మంది రాజకీయాలకు దూరంగా ఉంటుండటం విశేషం. ఆ నియోజకవర్గాల్లో తిరిగి పాత టీడీపీ నాయకులే ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. వీరిని చంద్రబాబుతో పాటు పార్టీ నేతలుకూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.