ఈ నెల 23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

హైదరాబాద్ సెప్టెంబర్ 19 (way2newstv.com)
మాసబ్‌ ట్యాంక్‌లో ఉన్న సీడీఎంఏ కార్యాలయంలో బతుకమ్మ చీరల ప్రదర్శన జరిగింది. ప్రదర్శనను మంత్రి కేటీఆర్ సందర్శించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రిమాట్లాడుతూ... 24 వేల పైచిలుకు మగ్గాలు పనిచేసి 100 డిజైన్లతో కోటి చీరలు జిల్లాలకు సరఫరా చేసి 23వ తేదీ నుంచి పంపిణీకి అధికారులు సిద్ధం చేశారని తెలిపారు. 
ఈ నెల 23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

గౌరవ శాసనసభ్యులు,శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పంపిణీ కార్యక్రమాలను ప్రారంభిస్తారని వెల్లడించారు. 18 సంవత్సరాలు పైబడి తెల్లరేషన్ కార్డుకలిగి ఉన్న ఆడ బిడ్డలందరికీ చీరలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. బతుకమ్మ చీరెలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.313 కోట్లు ఖర్చు చేసింది. బతుకమ్మ చీరలతో నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నామనిపేర్కొన్నారు.
Previous Post Next Post