30 నుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

30 నుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాలు

తిరుమల, సెప్టెంబర్ 5, (way2newstv.com)
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 8 వరకు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా  సెప్టెంబర్ 24 మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ను టీటీడీ బుధవారంవిడుదల చేసింది. సెప్టెంబరు 29 ఆదివారం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. సెప్టెంబరు 30 వతేదీ సోమవారం సాయంత్రం గం.05-23 ని.లకు మీనలగ్నంలో జరిగే ధ్వజారోహణంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 
30-09-2019 రాత్రి గం.8-00 నుండి గం.10-00 వరకు పెద్దశేష వాహనసేవ 
01-10-2019 ఉదయం గం.09-00 నుండి గం.11-00 వరకు చిన్నశేష వాహనసేవ
                   రాత్రి గం.8-00 నుండి గం.10-00 వరకు హంస వాహనసేవ
30 నుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాలు

02-10-2019 ఉదయం గం.09-00 నుండి గం.11-00 వరకు సింహ వాహనసేవ
                  రాత్రి గం.8-00 నుండి గం.10-00 వరకు ముత్యపు పందిరి వాహనసేవ
03-10-2019 ఉదయం గం.09-00 నుండి గం.11-00 వరకు కల్పవృక్ష వాహనసేవ 
                  రాత్రి గం.8-00 నుండి గం.10-00 వరకు సర్వభూపాల వాహనసేవ 
04-10-2019 ఉదయం గం.09-00 నుండి గం.11-00 వరకు మోహినీ అవతార వాహానసేవ
                  రాత్రి గం.7-00 నుండి గం.12-00 వరకుల గరుడ వాహానసేవ
05-10-2019 ఉదయం గం.09-00 నుండి గం.11-00 వరకు హనుమంత వాహానసేవ
                  రాత్రి గం.8-00 నుండి గం.10-00 వరకు గజ వాహనసేవ
06-10-2019 ఉదయం గం.09-00 నుండి గం.11-00 వరకు సూర్యప్రభ వాహానసేవ
                   రాత్రి గం.8-00 నుండి గం.10-00 వరకు చంద్రప్రభ వాహానసేవ 
07-10-2019 ఉదయం గం.7-00 లకు రధోత్సవం
                    రాత్రి గం.8-00 నుండి గం.10-00 వరకు  అశ్వవాహానసేవ
08-10-2019 ఉదయం గం.6-00 లకు చక్రస్నానం నిర్వహిస్తారు. 
                  రాత్రి గం.7 గంటలకు ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.