424 కోట్లకు చేరిన సాహో కలెక్షన్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

424 కోట్లకు చేరిన సాహో కలెక్షన్స్

హైద్రాబాద్, సెప్టెంబర్ 14, (way2newstv.com)
‘సాహో’ కలెక్షన్ల కుమ్ముడు కొనసాగుతోంది. ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన హై రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో భారీ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. 14వ రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 424 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో సత్తా చాటింది. టాక్ సంగతి పక్కన పెట్టేస్తే.. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్స్ సునామీ సృష్టించింది. అన్ని ఏరియా లనుంచి హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో సంచలనం సృష్టించింది.
 424 కోట్లకు చేరిన సాహో కలెక్షన్స్

ప్రభాస్ కలెక్షన్స్ పవర్ ఏంటో ఈ సినిమా మరోసారి ప్రూవ్ అయ్యింది.పాన్ ఇండియా సినిమాగా విడుదలై అన్ని భాషల్లోనూ ప్రభంజనం సృష్టించింది. అత్యున్నత సాంకేతిక నిపుణులతో వరల్డ్ క్లాస్ సినిమాగా ‘సాహో’ రూపొందింది. హాలీవుడ్ సినిమాల స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు సుజీత్. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్, స్టంట్ కొరియోగ్రాఫర్లు పని చేశారు. ప్రభాస్ కెరీర్‌లొనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మించారు. శ్ర‌ద్ధా క‌పూర్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసింది. భారీ ఖర్చుతో యూవీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.