న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18,(way2newstv.com)
రైల్వే ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. ఈ ఏడాది వారికి 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా చెల్లించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. క్యాబినెట్ మీటింగ్ తర్వాత మాట్లాడుతూ..
రైల్వే ఉద్యోగులకు 78 రోజల బోనస్
సుమారు 11 లక్షల 52వేల మంది రైల్వే ఉద్యోగులకు బోనస్ ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. ఉద్యోగుల్లో ప్రేరణ నింపేందుకు బోనస్‌ను ప్రకటిస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొన్నది. తమ ప్రభుత్వం గత ఆరేళ్ల నుంచి రికార్డు స్థాయిలో రైల్వే ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నట్లు మంత్రి జవదేకర్ తెలిపారు.