సిక్కోలు ఎంపీ జై జగన్ అనడంలో వ్యూహాం ఏమిటీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సిక్కోలు ఎంపీ జై జగన్ అనడంలో వ్యూహాం ఏమిటీ

శ్రీకాకుళం, సెప్టెంబర్ 6, (way2newstv.com)
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ రాజకీయాల్లో పదేళ్ళ పాటు ప్రత్యక్షంగా ఢీ కొట్టారు. ఒకరు ప్రతిపక్ష నేతగా మరొకరు ముఖ్యమంత్రిగా అయిదేళ్ళు, తరువాత అటూ ఇటూ హోదాలు మార్చుకుని మరో అయిదేళ్ళూ ఉమ్మడి ఏపీలో రంజైన రాజకీయం నడిపారు. ఉప్పు నిప్పులా ఇద్దరి మధ్య కధ మొత్తం నడించింది. వైఎస్సార్ నవ్వుతోనే చంద్రబాబుకు చిర్రెత్తించేలా చేసేవారు. . ఇక రెండుమార్లు బాబును ఆయన ఓడించి మరీ తన సత్తా చాటారు. అటువంటి వైఎస్సార్ కుటుంబం నుంచి వచ్చిన జగన్ తాజా ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచి టీడీపీకి ఘోరమైన పరాజయం మిగిల్చారు. ఇవన్నీ కళ్ళ ముందుండగా టీడీపీకి చెందిన ఓ ఎంపీ వైఎస్సార్ ని బాహాటంగా కీర్తిస్తే ఏమైనా ఉందా.ఈ మాటలు అన్నది ఎవరో కాదు, శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహననాయుడు.
సిక్కోలు ఎంపీ జై జగన్ అనడంలో వ్యూహాం ఏమిటీ

వైఎస్సార్ పదవ వర్ధంతి సందర్భంగా ఆయనకు తన ట్విట్టర్ ద్వారా నివాళి అర్పించిన జూనియర్ ఎర్రన్నాయుడు వైఎస్సార్ ను,  జనం అభిమానాన్ని పూర్తిగా గెలుచుకున్న నేతగా అభివర్ణించారు. మాస్ లీడర్ అన్న దానికి ఆయనే ఉదాహరణ అన్నారు. వైఎస్సార్ ప్రజా నాయకుడు, అనేక కార్యక్రమాలను పేదల కోసం అమలుచేసిన ఘనత ఆయనకే దక్కిందని కూడా కొనియాడారు. విశేషమేంటంటే తన ట్విట్టర్ ఖాతలో జై జగన్ అంటూ ఆయనకు కూడా ఈ మేసేజ్ చేరేలా ట్యాగ్ చేసి పంపడం. అంటే జగన్ చూడాలన్న తాపత్రయం టీడీపీ ఎంపీలో ఎక్కడో ఉండకపోతే ఇలా చేయరన్న మాట కూడా వినిపిసోంది. మరి ఇంతలా వైఎస్సార్ ను రామ్మోహననాయుడు పొగడడం, అదీ ఇపుడున్న రాజకీయ వాతావరణంలో హాట్ టాపిక్ గానే ఉంది.ఇక చంద్రబాబు వైఎస్సార్ ని అసలు తలచుకోరు అన్నది అందరికీ తెలిసిందే. ఈ మధ్య జరిగిన ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్సార్ తన బెస్ట్ ఫ్రెండ్ అన్నారు, ఒకే మంచం, ఒకే మంచం తమ ఇద్దరిదీ అని కూడా చెప్పుకున్నారు. అటువంటి ఫ్రెండ్ ని వర్ధంతి వేళ కనీసం తలచుకోవడం ధర్మమైనా కూడా బాబు మరచారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కు జన్మ దిన శుభాకాంక్షలను ఆయన తెలియచేశారు. వైఎస్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని బాబు చెప్పినా ఎవరూ నమ్మరు, బాబు అంతరాత్మ అంతకంటే నమ్మదు, అందుకే ఆయన ట్విట్టర్ లో కూడా ఒక్క అక్షరం కూడా వైఎస్సార్ అంటూ కదల‌లేదు. మరి ఇపుడు జగన్ పాలన సాగుతోంది. వైఎస్ కుటుంబం అంటేనే మండిపడుతున్న చంద్రబాబుకు సొంత పార్టీ ఎంపీ ఇలా కీర్తించడం అంటే షాకింగ్ పరిణామమే. మరి ఆ ఎంపీ సంగతేంటి. ఎందుకిలా చేశారు అన్నది ముందు ముందు చూడాలి. మొత్తానికి ఏపీ రాజకీయల్లో జూనియర్ ఎర్రన్నాయుడు కలకలం రేపారనే అనుకోవాలి.