బుట్టా రేణుక రూట్ మార్చేశారా... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బుట్టా రేణుక రూట్ మార్చేశారా...

హైద్రాబాద్, సెప్టెంబర్ 23, (way2newstv.com)
బుట్టా రేణుక. క‌ర్నూలు పార్ల‌మెంటు స్తానం నుంచి 2014లో అనూహ్యంగా వైసీపీ టికెట్‌పై విజ‌యం సాధిం చిన మ‌హిళా నేత. మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌గా ఉన్న ఆమె జిల్లా రాజ‌కీయాల్లో
మ‌హామ‌హులుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డితో పాటు టీడీపీ అభ్య‌ర్థి బీటీ.రామ‌య్య లాంటి కీల‌క నేత‌ల‌ను ఆ ఎన్నిక‌ల్లో ఆమె ఇక్క‌డ మట్టి క‌రిపించి మ‌రీ వైసీపీ జెండా ఎగిరేలాచేసింది. కీల‌క‌మైన జిల్లాలో ప‌ట్టు సాధించేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. అయితే, గెలిచిన వెంట‌నే అప్ప‌టి వ‌ర‌కు వైసీపీ జెండా ప‌ట్టుకున్న ఆమె భ‌ర్త నీల‌కంఠం.. వెంట‌నే టీడీపీలో చేరిపోయారు. రాష్ట్రంలోటీడీపీ ప్ర‌భుత్వం ఏర్పాటు కావ‌డంతో ఆయ‌న త‌న వ్యాపారాలు కాపాడుకునేందుకే నంద్యాల ఎంపీగా గెలిచిన ఎస్పీవై.రెడ్డితో క‌లిసి ఫ‌లితాలు వ‌చ్చిన మ‌రుస‌టి రోజే బాబు స‌మ‌క్షంలో టీడీపీ కండువాక‌ప్పుకున్నారు.
బుట్టా రేణుక రూట్ మార్చేశారా...

ఈ క్ర‌మంలోనే బుట్టా రేణుక కూడా పార్టీ మారిపోతార‌ని అందరూ అనుకున్నారు. కానీ, ఆమె కొంత సంయ‌మ‌నం పాటించారు. బుట్టా రేణుక పార్టీ మార‌క‌పోయినా ఆమె టీడీపీ మ‌నిషేఅన్న ముద్ర‌ప‌డిపోయింది. అటు వైసీపీ వాళ్లు ఆమెను పూర్తిగా న‌మ్మ‌ని ప‌రిస్థితి. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందించే విష‌యంలోనూ… జిల్లా స‌మ‌స్య‌ల‌పై పార్ల‌మెంటులో త‌న వాణి వినిపించ‌డంలో ూరేణుక త‌న‌దైన ముద్ర వేశార‌నే చెప్పాలి. ఉన్న‌త విద్యావంతురాలు కావ‌డం.. ఆంగ్ల‌భాష‌పై మంచి ప‌ట్టు ఉన్న నేప‌థ్యంలో పార్ల‌మెంటు ప్ర‌సంగాల్లోనూ స‌త్తా చాటారు.కానీ, 2017 నాటికి మాత్రంబుట్టా రేణుక కూడా చంద్ర‌బాబు ఆక‌ర్ష్ మంత్రానికి లొంగిపోక త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలోనే ఆమె 2017 మ‌ధ్య‌లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ ఏ కార్య‌క్ర‌మం నిర్వ‌హించినా బుట్టా రేణుకపాల్గొన్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. వీరికి వ్యాపారాలు ఉండ‌డ‌మే. ఇక‌, వైసీపీకి రాం రాం చెప్ప‌డం వెనుక త‌నకు ఎంతో ఇష్ట‌మైన ఎమ్మిగ‌నూరు నుంచి పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగు పెట్టాల‌ని బుట్టారేణుక భావించారు. అక్క‌డ బుట్టా రేణుక సొంత సామాజిక‌వ‌ర్గం అయిన చేనేత వ‌ర్గం ఎక్కువుగా ఉండ‌డంతో రేణుక ఎంపీ సీటు క‌న్నా అసెంబ్లీ సీటే ఆశించారు. కానీ, వైసీపీ నుంచి ఎలాంటి హామీరాలేదు. దీంతో ఆ టికెట్‌ను ఆశించి కూడా బుట్టా రేణుక టీడీపీ తీర్థం పుచ్చుకున్నార‌ని అంటారు.అయితే, టీడీపీలోనూ బుట్టా రేణుకకు ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు. ఎమ్మిగ‌నూరు కోసం ప‌ట్టుబ‌ట్ట‌గాచంద్ర‌బాబు ఆమెకు కర్నూలు ఎంపీ సీటునే ఇస్తామ‌న్నారు. ఇంత‌లో ఎన్నిక‌ల‌కు ముందు బుట్టా రేణుకకు అదిరే షాక్ త‌గిలింది. సీనియ‌ర్ రాజ‌కీయ కుటుంబం కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి పార్టీ మారి..టీడీపీలోకి చేర‌డంతో చంద్ర‌బాబు ఆయ‌న‌కు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో అటు.. బుట్టాకు ఎమ్మిగ‌నూరు స‌హా.. క‌ర్నూలు ఎంపీ సీటులో టికెట్‌ను కూడా ద‌క్కించుకోలేక పోయారు. ఈ నేప‌థ్యంలోనేఎన్నిక‌ల‌కు ముందు బుట్టా రేణుక మ‌ళ్లీ బ్యాక్ టు పెవిలియ‌న్ అన్న‌ట్టుగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.అంతేకాదు, మంగ‌ళ‌గిరిలో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి..లోకేష్‌కు వ్య‌తిరేకంగా ఆమె ప్ర‌క‌ట‌న‌లు జారీ చేశారు. ప‌ద్మ‌శాలి వ‌ర్గానికి చెందిన బుట్టా రేణుక.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు.. లోకేష్‌ను ఎన్నుకోవ‌ద్దు.. చిత్తుగా ఓడించండి.. అంటూ పిలుపు నిచ్చారు.. లోకేష్ఓట‌మి కోసం ఆమె సామాజిక‌వ‌ర్గ నేత‌ల‌తో అక్క‌డ ప్ర‌చారం కూడా నిర్వ‌హించారు. ఇలా కొంత మేర‌కు వైసీపీలో పాజిటివ్‌గానే అడుగులు వేశారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఎలాంటి ప‌ద‌వి లేని బుట్టారేణుకకు జ‌గ‌న్ ఏం చేస్తార‌నే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది. ఏదైనా నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తారా? అనే చ‌ర్చ ఆస‌క్తిగా సాగుతోంది.ఇక‌, ఇలానే అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత కూడా త‌న రాజ‌కీయ భ‌విత‌వ్యాన్నిప్ర‌శ్నార్థ‌కం చేసుకున్నారు. 2014లో వైసీపీ త‌ర‌ఫున గెలిచి, ఆ పార్టీకి దూర‌మై.. టీడీపీ లో చేరాల‌ని భావించినా.. స‌రిపోక‌.. మ‌ధ్య‌లో ఎన్నిక‌ల‌కు ముందు సొంత పార్టీ పెట్టుకుని అది కూడావ‌ర్క‌వుట్ కాక‌.. ఇప్పుడు బీజేపీలో చేరిపోయారు. మ‌రి ఇప్పుడు ఈ పార్టీలో ఆమెను ఎవ‌రు ప‌ట్టించుకుంటారో..?  ఎవ‌రు ఆమెకు ప‌ద‌వులు క‌ట్ట‌బెడ‌తారో చూడాలి. ఏదేమైనా బుట్టా రేణుక‌, గీత ఇద్ద‌రుత‌మ‌కు వ‌చ్చిన గోల్డెన్ ఛాన్స్ వారే చేజేతులా మిస్ చేసుకున్నారు.