పురపాలక చట్ట బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పురపాలక చట్ట బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ సెప్టెంబర్ 21, (way2newstv.com)
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పురపాలక చట్ట బిల్లును మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు. శనివారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్  సమావేశాల్లో భాగంగా సభ ప్రారంభం కాగానే స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి  ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. తరువాత మంత్రి కేటీఆర్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. మంత్రి మాట్లాడుతూ ఐటీఐఆర్ అనేది ప్రాజెక్టు కాదని  అన్నారు.  ఐటీఐఆర్ అనేది రీజియన్ కింద రాష్ట్రాన్ని గుర్తించటమన్నారు. ప్రస్తుతం ఐటీ కింద ఐదున్నర లక్షలు మంది ఉద్యోగులు పని చేస్తున్నారన్నారు. 
పురపాలక చట్ట బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్

దేశంలోకెల్లా ఐటీ అభివృద్ధి రేటులో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. ఐటీఐఆర్ కింద రాష్ట్రానికి ఎలాంటి నిధులు రాలేదన్నారు. తెలంగాణ ఏర్పడే కంటే ముందు ఐటీ రంగంలో 3 లక్షల మంది ఉద్యోగులు పని చేసేవారు. ఇప్పుడా సంఖ్య సంఖ్య ఐదున్నర లక్షలకు చేరింది. ఐటీ రంగంలో దిగ్గజాలైన కంపెనీలు ఫేస్బుక్, ఆపిల్, గూగుల్, అమెజాన్లాంటి సంస్థలు  బెంగళూరు కాదని హైదరాబాద్కు వచ్చాయని అయన అన్నారు.  టీఆర్ఎస్ సర్కార్ సమర్థత వల్లే ఆ కంపెనీలు హైదరాబాద్కు తరలివచ్చాయి. 12 లక్షల 67 వేల ఉద్యోగాలు టీఎస్ఐపాస్ ద్వారా సృష్టించామని అయన వెల్లడించారు. తెలంగాణ యువతకు కేసీఆర్ సర్కార్పై సంపూర్ణ విశ్వాసం ఉందని కేటీఆర్ అన్నారు.