శామ్ కు కధలు నచ్చట్లేదే... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శామ్ కు కధలు నచ్చట్లేదే...

హైద్రాబాద్, సెప్టెంబర్ 5, (way2newstv.com)
ఓ బేబీ మూవీ హిట్ అందుకున్న సమంత కు మంచి పేరు వచ్చింది. ఈ మూవీ నిర్మించిన నిర్మాతలకు 20 కోట్లు దాకా లాభం వచ్చింది. అంటే సమంత తో సినిమా తీస్తే కచ్చితంగా 20 కోట్లు లాభం వస్తుందని, సమంతతో సినిమా తీద్దామని పలువురు నిర్మాతలు ఆమెని సంప్రదిస్తున్నారు. వీరిలో పెద్ద, చిన్న… డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారట. కానీ సామ్ మాత్రం వారిలో ఎవరితోనూ పని చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. కారణం తనకు కథలు నచ్చకపోవడం. ఆమె కు ప్రస్తుతం ఓ బేబీ, సూపర్‌ డీలక్స్‌ లాంటి కథలు కావాలని, ఆషామాషీ పాత్రలయితే తాను ఆల్రెడీ చాలానే చేసానని అంటోందట.
శామ్ కు కధలు నచ్చట్లేదే...

ఒకవేళ ఆమె వద్దకు అటువంటి కథలు తీసుకెళ్లినా హీరోయిన్ పాత్ర ఇలా ఉంటే బెటర్, వెరైటీగా ట్రై చేయండి అని చెబుతుండడంతో ఆమెతో సినిమాలు చేయడానికి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎవరు ముందుకు రావడంలేదట. ఎంత మంది డైరెక్టర్స్ ని ప్రొడ్యూసర్స్ పంపినా, ఎన్ని కథలు వినిపించినా రిజెక్ట్‌ చేస్తూనే ఉందట. సమంత తో సినిమా తీయడం కన్నా నాలుగైదు సినిమాలు తీసుకుని అదృష్టం పరీక్షించుకోవచ్చు అని నిర్మాతలు దండం పెట్టేస్తున్నారట. అందుకే సామ్ ప్రస్తుతం ఏమి సినిమాలు చేయడంలేదు. మరో వైపు శ్రియ.. ఒక్కప్పుడు పెద్ద పెద్ద హీరోలతో చేసిన అనుభవం ఉంది. మెగాస్టార్ నుండి శర్వా దాకా చాలామంది తో శ్రియ వర్క్ చేసింది. ఈమెకు టాలెంట్, యాక్టింగ్, గ్లామర్ అన్ని ఉన్నాయి కాబట్టే ఇన్నాళ్లు వెండితెరపైనే మెరుస్తుంది. గత ఏడాది రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కోస్చీవ్ ను వివాహమాడి శ్రీమతిగా మారిన శ్రియ ఈ మధ్య సినిమాలు తగ్గించింది. అయినా కానీ ఆమె చేతిలో రెండు,మూడు సినిమాలు ఉన్నాయి.నిన్న శ్రియ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. తాను ఏం చేసినా ప్రతిదీ సోషల్ మీడియా అకౌంట్స్ లో పెట్టే శ్రియ నిన్న కూడా ఒక వీడియోను పెట్టింది. తాను గతంలో ఇబీజా వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియోను నిన్న పోస్ట్ చేసింది సడన్ గా. ఆ వీడియో పెట్టి “అప్పట్లో ఇబిజాలో. మరోసారి అక్కడికి వెళ్ళే వరకూ ఆ జీవితాన్ని మిస్ అవుతున్నా @ఆండ్రీ కోస్చీవ్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.అందులో శ్రియ ఏం చేసింది అంటే….ఒక కత్తిలాంటి పింక్ బికినీ.. పైనేమో నెట్టెడ్ గౌన్ ధరించి నడుము ఊపుతూ తన్మయత్వంలో నవ్వుతూ డాన్స్ వేసింది. ఆమె వాలకం చూస్తూనే చుక్క కూడా వేసిందేమో అనిపిస్తుంది. అసలు ఈ వీడియో సడన్ గా ఆమె కు ఎందుకు గుర్తు వచ్చిందో? సామ్ రీసెంట్ గా స్పెయిన్ దేశంలో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తూ ఇబీజా ప్రదేశానికి సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేసింది. బహుశా శ్రియ కు అవి చూసి ఈ వీడియో గుర్తుకు వచ్చి పెట్టిందేమో?