జీహెచ్ఎంసీ అధికారుల క్షేత్రస్థాయి తనిఖీలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జీహెచ్ఎంసీ అధికారుల క్షేత్రస్థాయి తనిఖీలు

హైదరాబాద్, సెప్టెంబర్ 10, (way2newstv.com)
గ్రేటర్ హైదరాబాద్ లో  పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై జిహెచ్ఎంసి సీనియర్ అధికారుల క్షేత్రస్థాయి తనిఖీ లు ముమ్మరంగా  కొనసాగుతున్నాయి. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి  కె. టి రామారావు ఆదేశాలతో అడిషనల్ కమిషనర్లు,  జోనల్ కమిషనర్లు వారి వారి పరిధుల్లో శానిటేషన్ కార్యక్రమాలను తనిఖీ చేస్తున్నారు. జిహెచ్ఎంసి ఎంటామాలజీ,  ఆరోగ్య సిబ్బంది. నగరంలోని సమస్యాత్మక,  డెంగ్యూ,  మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి దోమల ఉత్పత్తి కేంద్రాలను తొలగిస్తున్నారు. 
జీహెచ్ఎంసీ అధికారుల క్షేత్రస్థాయి తనిఖీలు

ఇంట్లోని ఖాళీ పాత్రలు టైర్లు ఖాళీ స్థలాల్లో నీటి నిల్వలను తొలగిస్తూ,నీటి నిల్వల ద్వారా ఉత్పత్తయ్యే దోమలపై అవగాహన కల్పిస్తున్నారు.  డెంగ్యూ మలేరియా పాజిటివ్ కేసు లు నమోదైన  ఇళ్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో  లార్వా నివారణ మందును  విస్తృతంగా చల్లడం తో పాటు చుట్టుపక్కల 50 మీటర్ల వరకు ఉన్న ఇళ్లలో కూడా ముందు జాగ్రత్త చర్యగా దోమల నివారణ మందును స్ప్రే చేస్తున్నారు. దోమల నివారణ  చర్యలపై ఆడియో ద్వారా స్వచ్ఛ ఆటో ల ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.  నగర మేయర్  బొంతు రామ్మోహన్ మాణిక్ కేసరి నగర్ డివిజన్ లో,  కమిషనర్ లోకేష్ కుమార్  నక్లెస్ రోడ్,   జోనల్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ తో కలిసి  చెత్త  వ్యర్ధాలను రోడ్లపై తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.