తిరుపతి, సెప్టెంబర్ 20, (way2newstv.com)
ఈ పాపం ఎవరికీ జరగొద్దేమో……….. పగవాడీకి ఇటువంటి పరిస్థితి రాకూడదు…… మేం ఏం పాపం చేశామని మాకీ కర్మ…… అంటూ ఆ మహిళ కన్నీటి పర్వంతమైతే ఆమెను ఓదార్చేందుకు ఎవరితరం కావడం లేదు. ఎంత ఓదార్చినా ఆమె ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే అందిరినీ కలిచివేస్తోంది. మామ అస్థికలను గోదావరిలో కలిపి అక్కడి నుంచి సరదాగా విహారయాత్రకు వెళ్లారు. యాత్రలో ఎవరైనా గుర్తుగా ఏమైనా కొంటారు… కాని ఆమె మాత్రం రెండు శవాలను మోసుకొచ్చింది. ఇది గోదావరిలో బోటు ప్రయాణం చేసిన మధులత గాథ…సరదాగా సాగుతున్న వీరి బోటు ప్రయాణం విషాదం నింపింది…… కళ్ల ముందే కన్న కూతురు, కట్టుకున్న భర్త నీళ్లల్లో కొట్టుకుని పోతుంటే…. క్షణం… క్షణం భయాందోళనకు గురైంది. ఎన్ని ఆర్త నాథాలు చేసినా కాపాడేవారే లేక…..
కుటుంబాన్ని ఛిధ్రం భద్రం చేస్తున్న సంఘటన
ఆమె పరిస్థితి ఆమెకు బోదపడలేదు. కళ్ల ముందే కట్టుకున్న భర్త సుబ్రమణ్యంను, అల్లారు ముద్దుగా పెంచుకున్న హాసిని సుడిగుండాల్లో కొట్టుకుపోతుంటే మధులతకు గెండు ఆగిపోయినంత పనైంది.తిరుపతికి చెందిన సుబ్రమణ్యం, మధులతలు దంపతులు. వీరికి 12 ఏళ్ల హాసిని సంతానం. వీరు ఈ నెల 15వ తేదీన సుబ్రమణ్యం తండ్రి అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు వెళ్లారు. అక్కడ ఆ కార్యక్రమం పూర్తికాగానే అంతదూరం వెళ్లినందుకు పాపికొండలు చూడాలనుకున్నారు. ఇందుకోసం బోటెక్కారు. కాని పాపికొండల ప్రయాణం ప్రాణాలు తీసింది. గోదావరి నది పడవ ప్రమాదం సుబ్రమణ్యం కుటుంబాన్ని చిదిమేసింది. చిట్టిపొట్టి పలుకులతో, అల్లరి చేష్టలతో నిత్యం ఉత్సాహంగా ఉండే హాసిని.. నీటి ఉద్ధృతిలో కొట్టుకుపోయి కన్నుమూసింది. పుణ్యం కోసం గోదారమ్మ ఒడ్డుకెళ్తే.. పుట్టెడు శోకం మిగిలిందంటూ.. కన్న తల్లి కన్నీటి పర్యంతమవుతోంది.గోదావరి బోటు మునక ప్రమాదంలో సుబ్రమణ్యం, హాసిని, మధులతలు నీళ్లల్లో పడిపోయారు. అంతలోనే సుబ్రమణ్యం మధులతను వెనక్కి నెట్టడంతో ఆమె బోటును పట్టుకుని పైకి రాగలిగింది. మరుక్షణంలోనే సుబ్రమణ్యం మాత్రం గల్లంతయ్యారు. ఇక పేగు బంధం తెంచుకుని పుట్టిన హాసిని సైతం కనుమరుగైంది. ఈ విషాద ఘటనను చూసి మధులత తేరుకోలేకపోతుంది. గుండెలవిసేలా ఏడుస్తుంటే ఎంత బాధిస్తోందో అర్థమవుతోంది. నన్ను కాపాడి నా కళ్లముందే ఆయన నీటిలో మునిగిపోయారు. నా బిడ్డ నా కాళ్లు పట్టుకున్నా.. నేను కాపాడుకోలేకపోయాను అంటూ వచ్చిన ప్రతి బంధువుతో చెప్తూ మధులత కన్నీటి పర్వంతమవుతోంది.డాడీ …. నేను రాను .. రేపు మా స్కూల్లో పార్కుకు వెళ్తున్నాం…… స్కూల్ ఫ్రెండ్స్‌తో కలిసి జూ పార్క్‌కు వెళ్తా’నని హాసిని మారాం చేసింది. కాని సుబ్రమణ్యం నిరాకరించారు. నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటావంటూ నచ్చచెప్పారు. తాత అస్థికల్ని నిమజ్జనం చేయడానికి అందరం వెళ్లాలని తండ్రి సుబ్రహ్మణ్యం బలవంతం చేయడంతో తల్లిదండ్రులతో కలసి హాసిని వెళ్లింది. ఆ మరునాడే పడవ ప్రమాదంలో హాసిని ప్రాణాలు కోల్పోగా.. తండ్రి సుబ్రహ్మణ్యం గల్లంతయ్యాడు. ప్రమాదం నుంచి బయటపడిన మధులతకు కుమార్తె హాసిని మృత్యువాత పడిన విషయం మరుసటి రోజు తెలిసింది. కుమార్తె ఇక లేదని తెలిసి తల్లి మధులత గుండెలు బాదుకుంటూ తల్లడిల్లింది. తిరుపతికి చెందిన సుబ్రహ్మణ్యం సొంతూరు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వేపనపల్లి. ఆ చిన్నారి స్థానికంగా ఉన్న స్ప్రింగ్ డేల్ స్కూల్‌లో 7వ తరగతి చదువుతోంది. పాఠశాల యాజమాన్యం విద్యార్థులందరినీ 14న జూ పార్క్ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ రోజు స్కూలుకు వెళ్లిఉంటే హాసిని మృత్యువాత పడేది కాదేమో. ఇలా మధులత ఒక్కరిదే కాదు ఎందరో అభాగ్యులదీ ఇదే పరిస్థిత