కాళేశ్వరం సందర్శనకు బయల్దేరిన తెరాస శ్రేణులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాళేశ్వరం సందర్శనకు బయల్దేరిన తెరాస శ్రేణులు

వరంగల్ సెప్టెంబర్ 4, (way2newstv.com)
తెలంగాణ రాష్ట్ర  మాజీ ఉప ముఖ్యమంత్రి,  ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సారధ్యంలో వందలాది వాహనాల్లో వేలాది మంది టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు కాళేశ్వరం సందర్శనకు బయలుదేరారు. ఈ కార్యక్రమానికి  వరంగల్, మడికొండ వద్ద వాహనాలకు కడియం శ్రీహరి జెండా ఊపి కాళేశ్వరం సందర్శన యాత్రను ప్రారంభించారు. కడియం మాట్లాడుతూ   సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ నేతలు మన నీళ్ళని ఆంధ్రా నేతలు తరలించుకుపోతుంటే దద్దమ్మలు, సన్నాసుల్ల అధికారంలో ఉండి పదవులు కాపాడుకున్నారే తప్ప, తెలంగాణ ప్రజల హక్కులు, ప్రయోజనాల కోసం ఏనాడైనా పోరాడారా? అని అడుగుతున్నానని అన్నారు. 
కాళేశ్వరం సందర్శనకు బయల్దేరిన తెరాస శ్రేణులు

ఇప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ హక్కులు కాపాడుతుంటే విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం. వేల కోట్ల రూపాయల ప్రజా సొమ్మును నిసిగ్గుగా తినేసి, జల యజ్ఞాన్ని ధన యజ్ఞంగా  మార్చి రాష్ట్రాన్ని పీక్కు తిన్నారు.  ఏసీబీ, సీబీఐ, ఈడి కేసుల్లో ఇరుక్కుని జైళ్ల చుట్టూ ఈ కాంగ్రెస్ నేతలు తిరుగుతున్నారని అన్నారు. దేశంలో అవినీతి పై ఎవరికైనా పేటెంట్ హక్కులు ఉన్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ నేతలకే. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు గెలవగానే బీజేపీ ఉలికి, ఉలికి పడుతోంది. గ్రామాల్లో, నియోజకవర్గాల్లో ఎక్కడైనా బీజేపీ ఉందా అని అడుగుతున్నాని అయన అన్నారు. బీజేపీ కి తెలంగాణ లో ఓట్లు అడిగే హక్కే లేదు.  నరేంద్రమోదీ నాయకత్వం లో గత 5 ఏళ్లలో తెలంగాణ కి ఒరగబెట్టింది ఏమి లేదు. ఆంధ్రాకి పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి, తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ హోదా ఇవ్వమని సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పార్టీ బీజేపీ అని అన్నారు. కాజీపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ కి నిధులు ఇవ్వకుండా, రాష్టాన్ని పట్టించుకోకుండా ఏ మొఖం పెట్టుకొని బీజేపీ నేతలు తెలంగాణ ప్రజల వద్దకు వస్తారో చెప్పాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది ముగిసిన చరిత్ర. శతాధిక వృద్ధుడైన కాంగ్రెస్ పార్టీ అంపశయ్య పై ఉంది. టీఆర్ ఎస్ పార్టీ స్థాపించి 18 సంవత్సరాలు అవుతుంది. నూనూగు మీసాల నవ యవ్వనంలో ఉన్న పార్టీ. ముసలితనం సంతరించుకున్న కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ఇపుడే అడుగులు వేస్తున్న బీజేపీ నవ యవ్వనంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తో పోటీ పడలేవు.   తెలంగాణ లో అసలు సిసలు బాహుబలి కేసీఆర్ అని అయన అన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతిపక్షాలు చేసే విమర్శలు తిప్పి కొట్టాలని నేడు కాళేశ్వరం ప్రాజెక్టు కు వెళ్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మాన సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో నిర్మితమైన ఇంజినీరింగ్ మహా అద్భుతం. ప్రపంచంలో ని ఇంజినీరింగ్ నిపుణులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నాయకులు, కేంద్ర జల సంఘం అధికారులు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు  ఈ ప్రాజెక్టును ప్రశంసిస్తుంటే కాంగ్రెస్, బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కు 82 వేల కోట్ల రూపాయలు అంచనా వ్యయంలో ఇప్పటి వరకు 53వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా తొలి లబ్ది పొందే జిల్లా మన వరంగల్. ఇప్పటికే మిడ్ మానేరుకు నీరు చేరింది. తరవాత లోయర్ మానేరుకు వస్తుంది. మిడ్ మానేరు లో 25 టీఎంసీ ల నీరు, లోయర్ మానేరు లో 25 టీఎంసీ ల నీరు నిండి ఇక్కడి పొలాలు సస్యశ్యామలం అవుతాయి. తెలంగాణ లో 22 జిల్లాలకు నీరు అందించే తెలంగాణ వర ప్రదాయని ఈ కాళేశ్వరం ప్రాజెక్టని శ్రీహరి అన్నారు. ప్రపంచంలో నే తొలి అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం అతి తక్కువ సమయంలో చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది. అందుకే ఇంతటి గొప్ప ప్రాజెక్టును స్వయంగా చూసి ప్రతిపక్షాలు చేసే విమర్శలు తిప్పి కొట్టాలని ఈ ప్రాజెక్టు సందర్శన ఏర్పాటని అయన వివరించారు.