ప్రైవేట్ పాఠశాలలకు అమ్మఒడి పథకం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రైవేట్ పాఠశాలలకు అమ్మఒడి పథకం

విజయవాడ, సెప్టెంబర్ 17 (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్‌‌లో వచ్చే ఏడాది జనవరి 26 నుంచి అమలుకానున్న 'అమ్మ ఒడి' పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలతోపాటు.. ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేటు స్కూళ్లకు మాత్రమే వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లాస్థాయి అధికారులకు.. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. పాఠశాలల గుర్తింపుతోపాటుగా విద్యార్థి తల్లి బ్యాంకు అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబర్ వివరాలను సేకరించాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు.
ప్రైవేట్ పాఠశాలలకు అమ్మఒడి పథకం

ఏపీలో పిల్లలను పాఠశాలలకు పంపే ప్రతీ తల్లికీ ఏటా 15 వేల రూపాయల సాయం అందిస్తామని వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి.. ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించే ప్రతీ తల్లికి గణతంత్ర దినోత్సవం నుంచి రూ.15,000 సాయం అందించనున్నారు. అయితే ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు.ఇదిలా ఉండగా.. 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయాలని పలువురు విద్యావేత్తలు, మేథావులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటుగా.. ప్రైవేటు స్కూళ్లకూ కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తే భవిష్యత్తులో.. ఏ ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించే అవకాశం ఉండదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థికసాయం తీసుకుంటూ పిల్లలను ప్రైవేటు ఫాఠశాలల్లో చదివించుకుంటారని.. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మరింత దిగజారే అవకాశముందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.