టీడీపీకా పోయె... వైసీపీకి వచ్చే... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టీడీపీకా పోయె... వైసీపీకి వచ్చే...

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27  (way2newstv.com)
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ లో కార్యాలయాన్ని కూడా కోల్పోయింది. గతంలో టీడీపీకి కేటాయించిన కార్యాలయాన్ని ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీకి కేటాయించారు. ఏపీలో మొత్తం 25 ఎంపీ సీట్లు ఉండగా..వైసీపీ 22 సీట్లు గెలుచుకోగా..టీడీపీ కేవలం మూడు సీట్లకు పరిమితం అయిన విషయం తెలిసిందే. 
టీడీపీకా పోయె... వైసీపీకి వచ్చే...

ఈ క్రమంలో పార్టీల సభ్యుల సంఖ్య ఆధారంగా 15 రాజకీయ పార్టీలకు పార్లమెంట్‌లో గదులను కేటాయించారు. బీజేపీకి గ్రౌండ్ ఫ్లోర్‌లో 2, 3, 4 నంబరు గదులను కేటాయించారు.  కాంగ్రెస్ పార్టీకి 24, 25 నంబర్ గదులు దక్కాయి. 23 ఎంపీ సీట్లను గెలుపొందిన డీఎంకేకు 46వ నంబర్ గది, తృణమూల్ కాంగ్రెస్‌కు 20-బి రూమ్‌ను కేటాయించారు. 22 స్థానాలున్న వైఎస్ఆర్సీపీకి రూమ్ నంబర్ 5 కేటాయించారు. కాగా లోక్ సభలో ఐదుగురు సభ్యులున్న పార్టీలకు మాత్రమే పార్లమెంటులో ఆఫీసులను కేటాయించారు. అయితే టీడీపీకి కేవలం 3 సీట్లే ఉండటం వలన ఆ పార్టీకి కేటాయించలేదు. ఈ పరిణామం పార్టీ స్థాపించిన ఇన్నేళ్ళలో టీడీపీకి రాలేదు