ట్విటర్ వేదికగా భగత్ సింగ్ కు నివాళులు అర్పించిన సీఎం జగన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ట్విటర్ వేదికగా భగత్ సింగ్ కు నివాళులు అర్పించిన సీఎం జగన్

విజయవాడసెప్టెంబర్ 28  (way2newstv.com)
గుర్రం జాషువా 124వ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, మంత్రివెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ నందిగం సురేష్, రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యేలు మెరుగ నాగార్జున, రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు హాజరై గుర్రంజాషువాకు ఘనంగా నివాళులు అర్పించారు. 
ట్విటర్ వేదికగా భగత్ సింగ్ కు నివాళులు అర్పించిన సీఎం జగన్

అనంతరం సాహితివేత్తలు కత్తి పద్మారావు, బోయి హైమావతి, గుజ్జర్లమూడి కృపాచారి, చందు సుబ్బారావులకు పురస్కారాలను ప్రధానం చేశారు.భగత్ సింగ్ కు నివాళుర్పించిన జగన్ : స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ట్విటర్ వేదికగాఆయనకు నివాళులర్పించారు. ‘నేడు నిజమైన హీరో జన్మించిన రోజు. స్వాతంత్ర్యం కోసం ఆయన  చేసిన పోరాటం, త్యాగం ఎప్పటీకి మరవలేనివి, అలోచనలకు మరణం లేదనినిరుపించిన వ్యక్తి భగత్ సింగ్ ఆయనకు నా ఘన నివాళి’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.