సిద్దిపేట సెప్టెంబర్ 23,(way2newstv.com)
గజ్వెల్ పట్టణంలో నియోజకవర్గ మహిళలకు జ్యోతి ప్రజ్వలన చేసి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,కార్పొరేషన్ చైర్మన్లు సోమవారం
ప్రారంభించారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదలు బతుకమ్మ చీరల పంపిణీ గజ్వేల్లో ప్రారంభించుకున్నాం. సిద్దిపేట జిల్లాలో 3 లక్షల అరవై ఐదు వేల పైచిల్లుకు మహిళలకుబతుకమ్మ చీరాల పంపిణీ చేయనున్నాం. పేద మహిళకు బట్టలు పెట్టిన ముఖ్యమంత్రి మన కేసీఆర్.
చీరలు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు
మళ్ళీ బతుకమ్మ పండుగ వరకు కాళేశ్వరం నీళ్లలో బతుకమ్మలు వేసుకుంటామని అన్నారు.రాష్ట్రానికి ఆర్థిక మాంద్యం వచ్చింన కేంద్రంలో కోత పెట్టిన కూడా పెన్షన్లు,కల్యాణ లక్ష్మీ పథకాల్లో మాత్రం కోతలు లేకుండా ఇద్దాం అని అన్న ముఖ్యమంత్రి మన కేసీఆర్. 30 నుంచి నలబై వేల కోట్లరూపాయల లోటు బడ్జెట్ ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. కాంగ్రెస్ సోల్లో, తెలుగు దేశం వాళ్ళు ఉంటే ఊళ్ళలోకి నీళ్లు వచ్చేవా...? నూట యాబై కిలోమీటర్ల నుండినీళ్లు తెచ్చి ఆడపడుచుల కష్టాలు తీర్చిండు మన కేసీఆర్. కాంగ్రెస్ వాళ్లు ఉండగా ఒక్క పండుగకైనా బతుకమ్మ చీరలు ఇచ్చిరా అని ప్రశ్నించారు. భారత దేశంలో 2016 రూపాయల పెన్షన్ఇస్తున్నాం ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. ఏ ప్రభుత్వం తీసుకొనటువంటి గొప్ప నిర్ణయం బతుకమ్మ చీరల పంపిణని అన్నారు.