రాజ్ భవన్ స్కూల్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాజ్ భవన్ స్కూల్

డల్ గా ఉంటే...టీసీలు ఇచ్చారు
హైద్రాబాద్, సెప్టెంబర్ 26, (way2newstv.com)
చదువు రాని స్టూడెంట్స్ మాకొద్దు అంటూ 65మంది విద్యార్థులకు టీసీలు ఇచ్చిన రాజ్ భవన్ స్కూల్ హెడ్ మాస్టర్ సుమన్ పై వేటు పడింది. హెచ్ఆర్సీ ఆదేశాలతో స్కూల్ కి వెళ్లిన విద్యాశాఖ విచారణ చేపట్టింది. తప్పు ఉందని తేలడంతో హెడ్ మాస్టర్ పై విద్యాశాఖ అధికారులు వేటు వేశారు.స్టూడెంట్స్ బాగా చదవకపోతే.. ఏ హెడ్ మాస్టరైనా పనిష్మెంట్ ఇస్తాడు. కానీ.. అతను మాత్రం ఏకంగా టీసీ ఇచ్చేశాడు. అలా.. ఏ ఒక్కరికో.. ఇద్దరికో కాదు. ఏకంగా 65 మందికి టీసీలిచ్చి పంపేశాడు. ఇదెక్కడో కాదు.. హైదరాబాద్‌లో ఆదర్శపాఠశాలగా పేరు తెచ్చుకున్న రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాల. హైదరాబాద్‌లోనే ది బెస్ట్ గవర్నమెంట్ స్కూల్. 
రాజ్ భవన్ స్కూల్

మాజీ గవర్నర్ నరసింహన్ చొరవ తర్వాత.. సిటీలో, స్టేట్‌లో ఈ స్కూల్ పేరు మార్మోగింది. అప్పటి నుంచి.. ఈ స్కూల్లో అడ్మిషన్ల కోసం స్టూడెంట్స్, పేరెంట్స్ క్యూ కడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే.. కార్పొరేట్ స్థాయి విద్య అందుతోందని.. తమ పిల్లలను ఇక్కడ చేర్పించేందుకు పేరెంట్స్ బాగా ఆసక్తి చూపుతున్నారు. అలాంటి ఈ స్కూల్.. హెడ్ మాస్టర్ అత్యుత్సాహంతో మళ్లీ హెడ్‌ లైన్స్‌లోకి వచ్చింది.ఇప్పటికే ఆదర్శ పాఠశాలగా పేరొందిన రాజ్‌భవన్ స్కూల్‌ను.. టెన్త్ రిజల్ట్‌లో మంచి పర్సంటేజీ తీసుకొచ్చి.. అధికారుల దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలని భావించారు హెడ్ మాస్టర్ సుమన్. అంతే.. తన మేధావితనాన్ని మొత్తం రంగరించి.. చదువులో డల్‌గా ఉన్న 65 మంది స్టూడెంట్స్‌కు టీసీ ఇచ్చి పంపేశారు. ఈ వ్యవహారంపై.. ఇప్పటికే విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. డిప్యూటీ డీఈవో వివరాలన్నీ సేకరించి.. విద్యాశాఖ ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇచ్చారు. టీసీ ఎపిసోడ్‌పై.. హెడ్ మాస్టర్ సుమన్ మాత్రం తనకేం తెలియదంటున్నారు. విద్యార్థులు కోరితేనే.. టీసీ ఇచ్చామని బుకాయించే ప్రయత్నం చేశారు.ప్రిన్సిపల్ వాదన ఇలా ఉంటే.. స్టూడెంట్స్ వెర్షన్ మరోలా ఉంది. కావాలనే.. హెడ్ మాస్టర్ సుమన్ తమకు టీసీలిచ్చారని చెబుతున్నారు. స్టూడెంట్స్‌ను.. 3 గ్రూపులుగా విడదీయడం వల్లే క్లాసుల్లో వెనుకబడిపోయామని వాపోతున్నారు. మాజీ గవర్నర్ నరసింహ‌న్‌ చొరవతో.. తెలుగు మీడియంలో ఉన్న ఈ స్కూల్‌ను.. పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియంగా మార్చారు. తెలుగు మీడియం టీచర్లే.. ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెబుతుండటతో అంతగా రాణించలేకపోతున్నామంటున్నారు స్టూడెంట్స్. స్పెషల్ క్లాసులకు కూడా వస్తామని చెప్పినా.. ప్రిన్సిపాల్‌ చాలా మంది విద్యార్థులను ఇతర స్కూళ్లకు బలవంతంగా మార్చేశారని ఆరోపిస్తున్నారు. 65 మంది విద్యార్థులకు టీసీ ఇవ్వటమే కాదు.. కొందరు విద్యార్థులను డిటైన్డ్ చేసి తొమ్మిదో తరగతిలో ఉంచడంపైనా విమర్శలొస్తున్నాయ్.రాజ్ భవన్ స్కూల్ ఇంచార్జీ హెచ్ఎంగా ఉన్న సుమన్ పై కఠినచర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. తమ పిల్లలకు తిరిగి రాజ్‌భవన్‌ స్కూల్‌లో అడ్మిషన్‌ ఇప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.