మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి సెప్టెంబర్ 10 (way2newstv.com)
అందరూ కలిసి గ్రామంలోని బొడ్రాయి పండుగ ను ఏ విధంగా చేసుకుంటామో అదేవిధంగా గ్రామాభివృద్ధిలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొని గ్రామాలను అభివృద్ధి పంచుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం వనపర్తి జిల్లా గోపాల్పేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల అభ్యుదయం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ కంకణబద్ధులై కృషి చేస్తున్నాడని ఆయన అన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి
రైతులముఖాల్లో చిరునవ్వు చూడటమే ముఖ్యమంత్రి థేయంగా పెట్టుకున్నాడని, అందుకోసం సాగు, తాగునీటి కోసం వేల కోట్ల రూపాయలను వెచ్చించి ప్రాజెక్టుల సాధన కోసం నిర్విరామంగా కృషిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని ఆదుకోవడం కోసం ఎన్నో రకాల పథకాలను అమలు పరుస్తూ ఆదుకుంటున్న ఘనత ముఖ్యమంత్రి కే దక్కిందని ఆయన అన్నారు. అందులోభాగంగానే కళ్యాణ లక్ష్మి అనే పథకం అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా 14 మందికి ఆయన కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్య తిరుపతి యాదవ్, జెడ్ పి టిసి భార్గవి కోటేశ్వర్ రెడ్డి, తహసిల్దార్ రాధాకృష్ణ ,వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, సర్పంచ్ శ్రీనివాసులు, కోఆప్షన్ మెంబర్ మతిన్ తదితరులు పాల్గొన్నారు.