ఊరూర ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఊరూర ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు

ఆడపడుచుల ఆనందోత్సవాల మధ్య కోలాటాలు,ఆటపాటలు..
తీరొక్క పూలతో... కోటొక్క పాటలతో... తొమ్మిది రోజుల వేడుకలు
మంచిర్యాల సెప్టెంబర్ 27  (way2newstv.com)
మన తెలంగాణా రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే అతి పెద్ద పండగా బతుకమ్మ పండగ.పడగ సంబరాలను తెలంగాణా ఆడపడుచులు బతుకునిచ్చే అమ్మ బతుకమ్మ అనితీరొక్క పూలతో... కోటొక్క పాటలతో... తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులు ఆనందోత్సాహాల మధ్య. కోలాటాల ఆటపాటలకు అంగరంవైభవంగా నిర్వహించుకుంటారు. ఈ సంబరాలుఆడపడుచులను చిన్నపిల్లలను పది రోజుల పాటు అలరించనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం కావడంతో పట్టణాల్లో, పల్లెల్లో కొత్త కళ వచ్చేసింది దూరప్రాంతాల్లో నివసించే ఆడపడుచుల రాకతో ప్రతి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ప్రజలు తమ బతుకులు పండాలని జీవితంలో వెలుగులు నిండాలని బతుకమ్మ పండుగకుఘనంగా స్వాగతం పలుకుతూ ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తారు. 
ఊరూర ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ పండగ పూర్తిగా ప్రకృతితో ముడి పడి ఉన్న పూల పండుగ అందుకే తెలంగాణ ఆడపడుచులు తీరొక్కపూలను సేకరించి బతుకమ్మగా పేర్చి పార్వతి దేవిగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాగే ప్రకృతి పూలతో అందంగా బతుకమ్మను పేర్చి మధ్యలో పసుపుతో చేసినగౌరమ్మను ఉంచి బతుకమ్మ సంబరాలను ప్రారంభిస్తారు. ప్రతి యేటా వచ్చే భాద్రపద మాసం అమావాస్య రోజును పెత్రమవాస్య అని స్వర్గస్తులైన మూడుతరాల వారిని స్మరించుకుంటూఎంగిలి పూల బతుకమ్మ తో ప్రారంభమై అశ్వయుజ శుద్ధ అష్టమి వరకు తెలంగాణ ప్రాంతంలో సంబరాలు జరుపు కుంటారు. ప్రకృతి ఒడిలో పూసే గునుగా, గోరింట, బంతి, బీర,చామంతి,గుమ్మడి, సీతమ్మ జడ, కలువ పూలతో పాటు ప్రత్యేకంగా తంగేడు పూలతో బతుకమ్మను పేర్చి మధ్యలో తామరాకు ఉంచి పసుపుతో చేసిన గౌరమ్మను ఆకులో పెట్టి ఎంతో భక్తిశ్రద్ధలతోపెద్దలు పిల్లలు బతుకమ్మ పాటలు పాడుతూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ బతుకమ్మ సంబరాలు ప్రతి ఇంట్లో ఆనందోత్సాహాల మధ్య తొమ్మిది రోజుల పాటు  రోజుకో అవతారంతో కొలుస్తూ మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మగా, రెండో రోజు అటుకుల బతుకమ్మ గా, మూడవరోజు ముద్ద పప్పు బతుకమ్మగా, నాలుగవ రోజు నాన బియ్యం బతుకమ్మగా, అయిదవరోజు అట్ల బతుకమ్మ గా, ఆరవ రోజు అలిగిన బతుకమ్మగా, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మగా, ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మగా, తొమ్మిదవరోజు చివరగాసద్దుల బతుకమ్మ గా అభివర్ణిస్తూ ఈ వేడుకలను తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. బతుకమ్మ సంబరాలు ఆడపడుచులు బతుకమ్మలను పేర్చి అందరు కలిసిసమూహంగా ఒకచోట చేరి కోలాటాలు ఆడుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.... బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ బతుకమ్మ, గౌరమ్మ పాటలు ఆనందంగా చిన్న పెద్ద తేడాలేకుండా గడుపుతారు. అమావాస్య నాడు ఎంగిలి పూలతో మొదలై దుర్గాష్టమి రోజున ఎంతో ఆడంబరంగా సద్దుల బతుకమ్మను పేర్చి ఆట పాటలతో బతుకమ్మను కొలుస్తారు అనంతరంశోభ యాత్ర గా బయలుదేరి చెరువుల్లో పోయిరా బతుకమ్మ పోయిరా ... మళ్ళీ వచ్చే ఏడాదికి తిరిగి రావమ్మ అంటూ బతుకమ్మలు నిమజ్జనం చేస్తారు. మహిళలు ఇంటిల్లిపాది ఎప్పుడుసుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ గౌరమ్మకు నివేదించిన నైవేద్యాలను (పిండి పదార్థాలతో చేసిన సత్తు) ఇచ్చుకో అమ్మ వాయనం.. పుచ్చుకో అమ్మ వాయనం.. అంటూమహిళలు ఒకరికి ఒకరు వాయనం ఇచ్చుకుంటూ ఆస్వాదిస్తూ బతుకమ్మ సంబరాలకు ఆనందంగా ముగింపు పలుకుతారు. మరుసటి రోజు జరిగే విజయదశమి (దసరా) ఉత్సవాలకుకుటుంబ సమేతంగా వెళ్లి ఎంతో పవిత్రమైన  జమ్మి వృక్షానికి అందరికీ విజయాలు సమకూర్చాలని పూజలు చేసి విజయదశమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.కొన్నిచోట్ల రావణాసురుని వధ కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తారు ఇలాంటి తెలంగాణలోని చారిత్రాత్మకమైన పండుగను విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు సైతం అక్కడఘనంగా నిర్వహిస్తుంటారు..... తెలంగాణలో బతుకమ్మ పండుగకు తంగేడు పూల కొరత..తెలంగాణ ప్రాంత ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండగల్లో బతుకమ్మ పండుగఒకటి ప్రత్యేకమైన పండుగ ప్రకృతి అందాలతో ప్రకృతి ఒడిలో కూసే అందమైన రంగు రంగుల పూలతో బ్రతుకు పండాలని పువ్వులు రాసులుగా పోసినట్టు బతుకమ్మని పేర్చి పూజించేతెలంగాణ ప్రాంతంలో రోజురోజుకు తంగేడు పూల కొరత ఏర్పడుతుంది. బతుకమ్మ పండుగకు తంగేడు పూల కొరత రాను రాను పెరిగి పోతూ ఉండటం పట్ల తెలంగాణ ప్రజలు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మను పేర్చడం లో తంగేడుపూలు ఎంతో ప్రాముఖ్యాన్ని సంత రించుకున్నాయి  అలాంటి తంగేడు పూలు తెలంగాణలో అంతరించిపోయే ప్రమాదం ఉందనిపలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర పుష్పం అయిన తంగేడు పూలకు ప్రత్యామ్నాయంగా తంగేడు మొక్క లను హరితహారం లో భాగంగా పెంచాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. లేదంటే రాబోయే రోజుల్లో రాష్ట్ర పుష్పాన్ని (తంగేడు) భవిష్యత్ తరాల వారు చూసే అవకాశం సైతం ఉండదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.