ముంబై, సెప్టెంబర్ 17 (way2newstv.com)
చమురు ధరల సెగతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. ఆరంభ నష్టాలనుంచి మిడ్ సెషన్ తరువాత మరింత దిగజారిన సెన్సెక్స్ 600 పాయింట్లు పతనమై 36509 వద్ద, నిఫ్టీ 170 పాయింట్లు క్షీణించి 10832 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా సెన్సెక్స్ 37వేల స్థాయిని కోల్పోయింది. అలాగే నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 11,000 చివరకు 10900 పాయింట్ల స్థాయిని కోల్పోయింది.
భారీ నష్టాల్లో మార్కెట్లు
సౌదీ అరేబియాలోని అరామ్‌కో చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడుల నేపథ్యంలో సోమవారం చమురు ధరలు ఏకంగా 15 శాతం ఎగశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు షాక్ తగిలినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా సోమవారం యూరోపియన్, అమెరికన్ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. దీంతో దేశీయంగా కూడా దాదాపు అన్ని రంగాలూ నష్టపోతున్నాయి ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో, ఐటీ, ఫార్మ షేర్లు భారీగా నష్ట పోతున్నాయి. యాక్సిస్, టెక్ మహీంద్రా, ఎయిర్‌టెల్, హీరో మోటో, సిప్లా, బీపీసీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్, టాటా మోటార్స్ టాప్ లూజర్స్‌గా కొనసాగుతుండగా, వేదాంతా, టైటన్, గెయిల్, యస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, యూపీఎల్, ఓఎన్‌జీసీ, డాక్టర్ రెడ్డీస్, బ్రిటానియా లాభపడుతున్నాయి
Tags:
all india news