పసడి ధరకు బ్రేక్ లు

ముంబై, సెప్టెంబర్ 16, (way2newstv.com)
పసిడి ధర పతనానికి బ్రేకులు పడ్డాయి. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.10 పెరుగుదలతో రూ.39,100కు చేరింది. గ్లోబల్మార్కెట్‌లో బలమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ కొద్దిగా పుంజుకోవడం బంగారం ధరపై సానుకూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో రూ.35,850కు చేరింది. బంగారం ధర స్వల్పంగా పెరిగితే.. వెండి ధర మాత్రం భారీగాపతనమైంది. కేజీ వెండి ధర ఏకంగారూ.2,540 పతనమై రూ.48,760కు పడిపోయింది. 
పసడి ధరకు బ్రేక్ లు

పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ క్షీణించడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలుఇలానే ఉన్నాయి.ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.37,810కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10పెరుగుదలతో రూ.36,610కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర భారీగా దిగొచ్చింది. రూ.2,540 తగ్గుదలతో రూ.48,760కు పడిపోయింది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పరుగులుపెడుతోంది. పసిడి ధర ఔన్స్‌కు 0.98 శాతం పెరుగుదలతో 1,514.35 డాలర్లకు ఎగసింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 2.32 శాతం పెరుగుదలతో 17.98 డాలర్లకుచేరింది.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్,భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి
Previous Post Next Post